Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆరుపదుల వయస్సులోను కుర్రహీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన మధ్యలో రాజకీయాలలోకి వెళ్లిన తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు.అయితే ఇటీవల ఆచార్య చిత్రంతో పూర్తిగా నిరాశపరిచాడు.
ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో తన అప్‌కమింగ్ సినిమాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. దసరాకు గాడ్ ఫాదర్ సినిమాతో ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ ను ఇచ్చేలా చిరు ప్లాన్ చేస్తుండగా, ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ కావడం ఖాయం అంటున్నారు.
అసలు నిజం ఏంటి?
ప్రస్తుతం చిరంజీవి చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో ఓ మూవీ కూడా ఉంది. చాలా రోజుల క్రితమే మూవీ కి సంబంధిచిన ప్రకటన రాగా,ఇటీవల ఈ చిత్రంకి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా బయటకు రాలేదు.
ఆర్ఆర్ఆర్ నిర్మాత డీ.వి.వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించగా, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కాన్సిల్ అయిందని తెలుస్తుంది ఆచార్య అట్టర్ ప్లాప్ అవ్వడం వెంకీ కుడుముల సినిమాపై నీలి నీడలు కమ్ముకోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.
అనవసరంగా రిస్క్‌లు చేసి బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదని చిరు అనుకుంటున్నట్టుగా సమాచారం. మెగాస్టార్ ముందుగా సెకండ్ హాఫ్‌ను మార్చమని వెంకీ కుడుములకి చెప్పాడట. వెంకీ కుడుముల కూడా దాన్ని మార్చిన కూడా చిరుని అంతగా ఇంప్రెస్ చేయలేకపోయాడట.
ఈ క్రమంలోనే ఈ సినిమా విషయంలో రకరకాలుగా ఆలోచిస్తున్నాడట. ఇక ఈ సినిమా విషయంలో ఇండస్ట్రీలో మరికొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ ఈ సినిమాను అసలు క్యాన్సిల్ చేయలేదని.. ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాలపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి మరి..!