Chiranjeevi: ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ – 2022 అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పురస్కారాన్ని అందుకోవడానికి చిరంజీవి గోవాలో జరుగుతున్న ఇఫీకి వెళ్లారు . అక్కడ అవార్డు అందుకున్న తర్వాత మెగాస్టార్ వేదికపై భావోద్వేగానికి గురయ్యారు.
అవినీతి లేని ఏకైక రంగం సినీ రంగం అని చెప్పిన చిరు, ఇక్కడ టాలెంట్ ఉంటేనే ఎదుగుతాం అని ఆయన చెప్పుకొచ్చారు. నాకు యువ హీరోలు పోటీ కాదు.. నేనే వాళ్లకు పోటీ అని మెగాస్టార్ చిరంజీవి చెప్పడం కొసమెరుపు. ఇక నేను ఎప్పుడూ మీతోనే ఉంటా.. నా చివరి శ్వాస వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని ఆయన అన్నారు.
తెలుగు ప్రజల ప్రేమనే తనను ఇక్కడిదాకా తీసుకొచ్చిందని ,ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు మెగాస్టార్. ప్రస్తుతం ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చిందని.. భవిష్యత్తులో భారతీయ సినిమా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాంటూ చిరు స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వెళ్లడం కారణంగా కాస్త గ్యాప్ వచ్చిందని, అయితే పాలిటిక్స్ లోకి వెళ్లడం వల్లనే సినిమా విలువేంటో తెలిసిందని చిరంజీవి అన్నారు.
ఇక చిరంజీవిని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర ప్రశ్న అడిగారు. ‘సినిమాల్లోకి తిరిగి వెళ్లినట్టే.. రాజకీయాల్లో మళ్లీ వస్తారా..?’అని అనురాగ్ అడగ్గా.. చిరు దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని అన్నారు. దీంతో చిరు రాజకీయాలపై ఆసక్తి పెరగింది.
మెగాస్టార్ జనసేనలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు చిరంజీవి.
ఆయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవలే విడుదలై సక్సెస్ సాధించగా.. భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. . ఈ రెండు సినిమాలపై మెగా అభిమానులు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.
మరిన్ని చదవండి:
Bigg Boss Nominations: వాడివేడిగా నామినేషన్స్.. రేవంత్‌కి క్లాస్ పీకిన ఫైమా
‘టీ’ అనే పేరు ఎలా వచ్చింది ? చాయ్ చరిత్ర ఏంటి ? ఈ స్టోరీ చదివి తెలుసుకోండి