Chiranjeevi: తన సినిమాలతోనే కాదు సామాజిక సేవా కార్యక్రమాలతోను ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు చిరంజీవి. ఇప్పటికే ఎంతో మందికి సాయం అందించిన చిరు రీసెంట్‌గా ఓ ప్రముఖ నటుడికి సాయం చేసి అతడి ప్రాణాలు నిలబెట్టారు. తమిళ నటుడు పొన్నాంబళం గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో భాదపడుతుండగా, అతను తన వైద్యానికి గాను ఆర్ధిక సాయం అందించాలని కోరారు. ఈ క్రమంలో కొందరు ఆర్ధిక సాయం అందించిన అది సరిపోలేదు. దీంతో చిరంజీవికి తన బాధను వివరించారు.
‘అన్నయ్య నేను పొన్నాంబళం. నా ఆరోగ్యం బాగాలేదు.. వీలైన సాయం చేయండి అని చిరంజీవికి మెసేజ్ చేసి రిక్వస్ట్ చేశారట. దాంతో పది నిమిషాల తర్వాత అన్నయ్య నుంచి ఫోన్ రాగా, హైదరాబాద్ కి రాగలవా వైద్యం చేయిస్తాను అని అడిగారు. అయితే నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పడంతో వెంటనే చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్ళు.. మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పారట. నేను ఆసుపత్రికి వెళితే కనీసం నన్ను ఎంట్రీ ఫీజు కూడా అడగలేదు. నా వైద్యానికి రూ 45 లక్షలు ఖర్చు అయింది. అంతా చిరంజీవి అన్నయ్యే భరించారు అంటూ పొన్నాంబళం ఎమోషనల్ గా మాట్లాడారు. చిరంజీవి చేసిన సాయంపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
also read :
Shriya Saran Photo Gallery Collection
Viral Video : ఎన్‌కౌంటర్ చేయబోమని రాసివ్వాలి.. అప్పుడే ఆస్పత్రికి వస్తానంటూ ఖైదీ హల్ చల్!