Chiranjeevi: స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్న చిరంజీవి ఎన్నో ఆస్తులు కూడబెట్టుకున్నాడు. వాటిలో కొంత భాగాన్ని సోషల్ సర్వీస్‌కి వెచ్చిస్తున్నాడు. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తున్నాడు మెగాస్టార్. మొదటి నుండి మెగాస్టార్ సేవా కార్యక్రమాలలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. కరోనా సమయంలో చిరు చేసిన సేవలు ఎవరు మరచిపోరు. అయితే తాజాగా ఆయన దాన గుణం గురించి తెలుసుకొని ప్రశంసలు కురిపిస్తున్నారు.. తాను చదువుకున్న వైఎన్ కాలేజీకి చిరు ఎంపీగా ఉన్న టైమ్‌లో అడిగిన వెంటనే రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారట.
ఈ విషయాన్ని ఆ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ సత్యనారాయణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ మధ్య హైదరాబాద్‌లో నిర్వహించిన వైఎన్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్లో పాల్గొన్న చిరు .. ఈసారి ఎంపీ నిధుల నుంచి ఇచ్చానని.. నెక్స్ట్ టైమ్ సొంత నిధులు ఇస్తాననని చెప్పారని సత్యనారాయణ వివరించారు. కాలేజీ అభివృద్ధికి దాసరి నారాయణరావు కూడా ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు, కృష్ణంరాజు కూడా రూ.10 లక్షలు ఇచ్చారని సత్యనారాయణ గుర్తు చేసుకున్నారు. ఈ కాలేజ్‌లో దాసరి నారాయణ రావు, కృష్ణంరాజు, చిరంజీవితో పాటు దర్శకుడు ధవళ సత్యం, గజల్ శ్రీనివాస్, గీత రచయిత అనంత్ శ్రీరామ్ చదువుకున్నారని సత్యనారాయణ అన్నారు.
also read :
Rama Banam movie review : ‘రామబాణం’ మూవీ రివ్యూ .. గోపిచంద్ ఖాతాలో హిట్ పడ్డట్టేనా..!
Ugram Telugu movie review :’ఉగ్రం’ తెలుగు మూవీ రివ్యూ … అల్లరోడు హిట్ కొట్టినట్టేనా..!