HomecinemaChiranjeevi: చిరుకి ద‌క్కిన ప్ర‌తిష్టాత్మ‌క అవార్డ్.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎన్ని అవార్డులు ద‌క్కించుకున్నారో తెలుసా?

Chiranjeevi: చిరుకి ద‌క్కిన ప్ర‌తిష్టాత్మ‌క అవార్డ్.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎన్ని అవార్డులు ద‌క్కించుకున్నారో తెలుసా?

Telugu Flash News

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటే అభిమానులు పుల‌క‌రించిపోతారు. ఈ త‌రం, ఆ త‌రం అనే తేడా లేకుండా త‌న న‌ట‌న‌, డ్యాన్స్, యాక్ష‌న్ స్టైల్‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు చిరు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డు చిరంజీవిని వ‌రించ‌గా, ఆయ‌న‌కు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల నుండి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 150కి పైగా చిత్రాల్లో చిరంజీవి నటించారని , సినీ ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా ఈ అవార్డ్ ఇస్తున్న‌ట్టు తెలిపారు.

తెలుగు సినిమా రంగంలో చిరంజీవి విశేష ప్రజాదరణ పొందారని, హృదయాలను కదిలించే నటనా ప్రతిభ ఆయన సొంతం అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పద్మభూషణ్, రఘుపతి వెంకయ్య అవార్డు, పలుమార్లు నంది అవార్డు వంటి అనేక అవార్డులను అందుకున్న చిరంజీవి నటనతోపాటు సామాజిక బాధ్యతను కూడా గుర్తెరిగి బ్లడ్ బ్యాంక్‌ ఏర్పాటుచేయడం ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలు చేశారు. క‌రోనా స‌మ‌యంలో ఆయ‌న చేప‌ట్టిన సేవ‌ల‌కు అభిమానులు ఎంత‌గానో ఫిదా అయ్యారు. వారి అభిమానులు ఈ సేవాకార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేలా ప్రోత్సహించడం ప్రశంసనీయం.

అయితే చిరంజీవి ఇప్ప‌టి వ‌ర‌కు అనేక అవార్డులు అందుకున్నారు. అందులో ఫిలింఫేర్ అవార్డ్స్ విష‌యానికి వ‌స్తే 1983లో శుభ లేఖ‌( బెస్ట్ యాక్ట‌ర్). 1986లో విజేత‌( బెస్ట్ యాక్ట‌ర్), 1993లో ఆప‌ద్భాంద‌వుడు ( బెస్ట్ యాక్ట‌ర్), 1994లో ముఠామేస్త్రి (బెస్ట్ యాక్ట‌ర్), 2000లో స్నేహం కోసం( బెస్ట్ యాక్ట‌ర్), 2003లో ఇంద్ర ( బెస్ట్ యాక్ట‌ర్), 2005లో శంక‌ర్ దాదా ఎంబీబీఎస్‌( బెస్ట్ యాక్ట‌ర్), 2018లో ఖైదీ నెం 150( బెస్ట్ యాక్ట‌ర్), 2011 లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్, 2007లో ఫిలింఫేర్ స్పెష‌ల్ అవార్డ్ – సౌత్ ద‌క్కాయి. మూడు నంది అవార్డులు, కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్, సైమా అవార్డులు, ఇవి కాక లోకల్, ఇండియన్ స్టేట్స్ లో ఎన్నో లెక్కపెట్టలేనన్ని అవార్డులు, హానరరీ డాక్టరేట్లు సాధించారు హీరో చిరంజీవి.

సినీ రంగానికి చిరంజీవి చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చిన విష‌యం తెలిసిందే. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను చిరంజీవికి 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. కాగా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి అవ్వ‌డం విశేషం. ఇలా చిరంజీవిని ఎన్నో అవార్డులు వ‌రించిన కూడా ఎప్పుడూ నిగర్విగా కనిపిస్తారు. !.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News