Telugu Flash News

Chiranjeevi: రామ్ చ‌ర‌ణ్‌ని ఆకాశానికి ఎత్తేసిన జేమ్స్ కామెరూన్.. ఫుల్ ఖుష్ అయిన చిరు

Chiranjeevi: ఏ తండ్రికైన త‌న కుమారుడు అంచెలంచెలుగా ఎదుగుతుంటే ఆనందం ఉండ‌దా చెప్పండి. చిరుత సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌కి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ల‌భించాయి. ఇంటా బ‌య‌ట ఆయ‌నపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. హాలీవుడ్ దర్శకుడు.. టైటానిక్, అవతార్ సినిమాల ఫేమ్ జేమ్స్ కామరూన్ .. రామ్ చరణ్ పాత్ర గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

రామ్ చ‌ర‌ణ్ పాత్ర తనకు ఎంతో నచ్చిందంటూ కితాబిచ్చారు కామరూన్ కాకపోతే ఆ పాత్రను అర్ధం చేసుకోవడానికి కాస్త టైమ్ పడుతుందన్నారు. కాని ఒక సారి ఆ పాత్ర అర్థమయ్యాక హృదయం బరువెక్కుతుందంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు జేమ్స్ కామరూన్. ఇందులో రామ్ క్యారెక్టర్ ఎంతో సవాల్ తో కూడుకున్నదని పేర్కొన్నారు. జేమ్స్ కామెరూన్ తన కొడుకుని ఇలా పొగడంతో చిరంజీవి సంతోషం పట్టలేక పోయారు. వెంటనే ట్వీట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. మీ అంతటి గ్లోబల్ ఐకాన్, సినిమా మేధావి ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ను పొగడడం ఆస్కార్ అవార్డు కంటే తక్కువేమీ కాదు. రామ్ చరణ్ కు ఇదొక గొప్ప గౌరవం. రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదగడాన్ని ఓ తండ్రిగా గర్వంగా భావిస్తున్నాఅని ట్వీట్ చేశారు.

also read :

Accident: రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూసిన క‌మెడీయ‌న్ పెద్ద కుమారుడు

Immunity Boosting Fruits : రోగ నిరోధక శక్తి పెంచే 5 పండ్లు

Exit mobile version