Telugu Flash News

Rahul-Chinmayi : చిన్మయి, రాహుల్‌ని క‌లిపింది ఆ హీరోనా ?

Rahul-Chinmayi : ప్ర‌ముఖ క‌మెడీయ‌న్ వెన్నెల కిషోర్ త‌న కామెడీతో ప్రేక్ష‌కులని ఎంతగా న‌వ్విస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న కామెడీని హీరోలు కూడా బాగా ఇష్ట‌ప‌డ‌డంతో వారి సినిమాల‌లో వెన్నెల కిషోర్‌ని త‌ప్ప‌క తీసుకుంటారు. అయితే ఈ క‌మెడీయ‌న్ ఇప్పుడు హోస్ట్‌గా మారాడు. వెన్నెల కిశోర్ హోస్ట్‏గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది షోలో ప‌లు జంట‌లు సంద‌డి చేస్తూ వారి లైఫ్‌కి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డిస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపూల్స్‏లో ఒక‌టైన సింగర్ చిన్మయి, హీరో రాహుల్ జంట హాజ‌ర‌య్యారు. వీరిద్దరి జోడి ఇండస్ట్రీలో చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. అందుకు కార‌ణం ఎప్పుడూ క్లాస్ లుక్‏తో సైలెంట్‏గా కనిపించే రాహుల్.. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే సింగర్ చిన్మయి పెళ్లి బంధంతో ఒక్క‌టి కావ‌డ‌మే.

హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి.. దర్శకుడిగా, అలాగే ప్రత్యేకమైన క్యారెక్టరతో స్క్రీన్ మీద అద్భుతాలు చేశాడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌. మ‌ల్టీ టాలెంటెడ్‌గా ఇండ‌స్ట్రీలో మంచి పేరు ప్ర‌ఖ్యాతలు సంపాదించుకున్నాడు రాహుల్‌. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి.. చిలసౌతో దర్శకుడిగా మారిన రాహుల్‌… చిలసౌ సినిమాకు గానూ బెస్ట్ ఒరిజనల్ స్ర్కీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డును కూడా ద‌క్కించుకున్నారు.

ఇక చిన్మయి విష‌యానికి వస్తే.. సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంత‌గానో అల‌రించింది చిన్మయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో పాటలు పాడిన ఆమె స‌మంత‌కు డ‌బ్బింగ్ చెప్పి ఆమె కెరియ‌ర్ పీక్స్‌లోకి వెళ్ల‌డంలో ముఖ్య పాత్ర పోషించింది. ఇక సోషల్ అవైర్నెస్ ప్రోగ్రామ్స్ లో చురుగ్గా పాల్గొనే చిన్మ‌యి .. ఆడ పిల్లలపై లైంగికపరమైన దాడులు జ‌రిగిన‌ప్పుడు వారికి అండగా ఉంటూ పెద్ద‌ ఉద్యామం కూడా చేస్తుంటుంది..

తాజాగా వెన్నెల కిషోర్ షోకి హాజ‌రైన రాహుల్‌, చిన్మ‌యి జంట తమ మధ్య ప్రేమ ఎప్పుడు ఎలా మొదలయ్యింది ?.. ఎన్ని మలుపులు తిరిగింది అనే విషయాలను రివీల్ చేశారు. అంతేకాదు త‌మ లవ్ స్టోరీ కోసం సాయం చేసిన హీరో ఎవరనేది కూడా చెప్పుకొచ్చారు. డబ్బింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి ఎవరో క్యూట్ ఉన్నాడు కదా అని చిన్మ‌యి భావించింద‌ట‌. పెళ్లి తర్వాత ఈ విషయాన్నే తనే చెప్పింది అంటూ రాహుల్ అన‌డంతో.. అయ్యో.. ఇదేంటో వాగుతున్నాడు అంటూ ఫన్నీ కామెంట్ చేసింది చిన్మయి.

పెళ్లి వద్దనుకున్న అంటూ చిన్మయి చెప్పగా.. తనను కలిసేముందు వరకు నేను కూడా అదే అనుకున్నా అంటూ రాహుల్ స్ప‌ష్టం చేశాడు. ఇక వీరి లవ్ స్టోరీకి హెల్ప్ చేసింది హీరో సందీప్ కిషన్ అని సింగర్ చిన్మయి తెలియ‌జేసింది. సందీప్ .. నువ్వు రాహుల్‏ను కలవాలి.. తనను మీట్ అవ్వాలి అని చెప్పేవాడని చిన్మయి చెప్పగా… సందీప్ తనకోసం అక్కడ మార్కెటింగ్ చేస్తున్నాడని రాహుల్ చెప్పుకొచ్చాడు. మార్కెటింగ్‌లో సందీప్ కిషన్‌‌ది వేరే లెవల్ యాక్చువల్‌గా..అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు వెన్నెల కిశోర్. మొత్తానికి షో మాత్రం ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని ప్రోమోని బ‌ట్టి తెలుస్తుంది.

click here to watch promo

Exit mobile version