Telugu Flash News

‘కాంతారా’ పై చిలుకూరు అర్చకులు రంగరాజన్ గారి ట్వీట్ వైరల్

chilkur balaji temple priest viral tweet about kantara

chilkur balaji temple priest viral tweet about kantara

‘కాంతారా’ ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటున్న సినిమా. మొదట కన్నడలో రిలీజ్ అయ్యి ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీలో కూడా రిలీజ్ అయ్యి అఖండ విజయం సాధించిన ఈ సినిమా మలయాళంలో కూడా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. కర్ణాటకలోని కుందాపుర ప్రాంతంలోని గిరిజన సంప్రదాయం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘కాంతారా’.

ఈ సినిమాను చూసినవారందరూ మనం మర్చిపోతున్న మన హిందూ సంప్రదాయాలను మనకు తెలియజేస్తుందని అందరూ తప్పక చూడాల్సిన సినిమా అని అంటున్నారు.

అయితే ఇప్పుడు చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ గారు చేసిన ట్వీట్ కూడా ఈ విషయానికి బలాన్ని చేకూరుస్తుంది.

ఈ సినిమాలో చూపించినట్టు దేవతలు తమకు చేసిన వాగ్దానాలను సీరియస్‌గా తీసుకుంటారని, వాటిని చట్టబద్ధంగా నిలబెట్టుకోగలుగుతారని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఆయన ట్వీట్ చేస్తూ, “దేవతలు తమకు ఇచ్చిన వాగ్దానాన్ని సీరియస్‌గా తీసుకుంటారని, వాటిని రాజ్యాంగపరంగా అమలుచేసే అధికారం కూడా ఉంది అన్నారు. ఆర్టికల్ 363 హిందూ దేవత హక్కుల చర్చ మరియు ధర్మం యొక్క అసలైన విజయం అని పేర్కొంది. కాంతారా చిత్రం యొక్క ముఖ్య సందేశం కూడా అదే” అన్నారు. ప్రస్తుతం, ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా రంగరాజన్ గారి ద్వారా ఈ సినిమా ప్రేక్షకులకు మరొక విషయం తెలిసింది.

ఇవి కూడా చూడండి :

చలికాలం పొడిచర్మం ఇబ్బందా..ఈ చిట్కాలు మీ కోసమే

బరువు తగ్గాలంటే ఈ స్నాక్స్ తినాల్సిందే.

Exit mobile version