టీమిండియా టెస్టు క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో 100 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు నేటి నుంచి మొదలైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌తో పుజారా అరుదైన ఫీట్‌ను చేరుకున్నాడు. తొలి టెస్టులో భారీ విక్టరీ సాధించిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లోనూ గెలవాలని పట్టుదలగా ఆడుతోంది.
ఈ క్రమంలోనే భారత వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా వంద మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నాడు. తాజాగా ఈ మ్యాచ్‌కు ముందు పుజారా పలు ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. దేశం తరఫున తాను వంద మ్యాచ్‌లు ఆడతానని ఎప్పుడూ అనుకోలేదని పుజారా చెప్పాడు. మీ డ్రీమ్ ఏంటని మీడియా సమావేశంలో అడగ్గా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో ఇండియాను విజేతగా చూడాలనుకుంటున్నానని చెప్పాడు. టీమిండియా నయా వాల్‌గా పేరు గాంచిన పుజారా.. తన కోరికను వ్యక్తపరిచాడు.
వంద టెస్టులు ఆడటం తనకు, తన కుటుంబానికి ఎంతో గొప్ప విషయమని పుజారా చెప్పాడు. తన కుటుంబం మద్దతుగా నిలిచిందని గుర్తు చేసుకున్నాడు. తన తండ్రి ఎంతగానో సపోర్ట్ చేశారని పుజారా భావోద్వేగమయ్యాడు. తాను ఇంకా సాధించాల్సింది చాలా ఉందని తెలిపాడు. ఇండియా తరఫున ఇప్పటి వరకు 99 మ్యాచ్‌లు ఆడిన పుజారా.. 44.15 సగటుతో 7,021 పరుగులు పూర్తి చేశాడు. 19 సెంచరీలు, 34 అర్ధ శతకాలు, మూడు డబుల్ సెంచరీలు సాధించడం విశేషం.
2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడిపోయామని.. ఈసారి ఎలాగైనా గెలవాలనే తపన ఉందని ఛతేశ్వర్ పుజారా చెప్పాడు. ఎంతటి ఘనమైన ఫాస్ట్ బౌలర్ అయినా వారికి విసుగు పుట్టించేలా ఆడుతూ టీమిండియాలో రాహుల్ ద్రవిడ్ తర్వాత అంతటి వాల్‌గా పుజారా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరో రెండు టెస్టుమ్యాచ్‌లు గెలిస్తే.. భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధిస్తుంది. తొలి టెస్టులో విజయంతో జోరుమీదున్న భారత్.. స్పిన్నర్ల సాయంతో ఈ మ్యాచ్‌లోనూ గెలవాలని చూస్తోంది.
also read:
Sri Reddy: నరేష్, పవిత్రలకి క్లాస్ పీకిన శ్రీరెడ్డి.. దుమ్ము రేపేసిందంతే..!