Homebigg boss telugu season 6Bigg Boss telugu 6: సీజ‌న్ మొత్తం నుండి చంటి బ్యాన్.. ఆదిరెడ్డికి కూడా గ‌ట్టిగానే ఇచ్చేశాడుగా..!

Bigg Boss telugu 6: సీజ‌న్ మొత్తం నుండి చంటి బ్యాన్.. ఆదిరెడ్డికి కూడా గ‌ట్టిగానే ఇచ్చేశాడుగా..!

Telugu Flash News

Bigg Boss telugu 6: శ‌నివారం వ‌చ్చిందంటే కంటెస్టెంట్స్ గుండెల్లో రైళ్లు ప‌రుగెత్త‌డం ఖాయం. నాగార్జున ఒక్కొక్క‌రిని నిలుచోబెట్టి మరీ క్లాస్ పీకుతుంటాడు. తాజా ఎపిసోడ్‌లో ఒక్కొక్కరికి క్లాస్ పీకుతూనే మరోవైపు ఫ‌న్ కూడా జ‌న‌రేట్ చేశాడు నాగార్జున‌. సింగ‌ర్ రేవంత్ భార్య సీమంతం అంశాన్ని శనివారం నాటి ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ప్రస్తావించారు. సీమంతం చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది అని కింగ్ అడగ్గానే.. చాలా బాగుందంటూ రేవంత్ ఎమోష‌న‌ల్‌గా చెప్పుకొచ్చాడు. మ‌రి నువ్వెప్పుడు చేయించుకుంటున్నావు సీమంతం? అని నాగ్ చిలిపి ప్రశ్న వేయడంతో వెంట‌నే స్పందించిన గీతూ.. ఆరోజే చెప్పినాను సార్.. కూర్చో నీకు కూడా దీవెన ఇస్తామని , ఆయ‌న వైఫ్ ప్ర‌గ్రెంట్ అయినప్పుడు ఈయన కూడా ప్రెగ్నెంటే అని స‌ర‌దా వ్యాఖ్య‌లు చేసింది గీతూ.

ఎంత క‌ష్టం..

హౌస్‌లో ఫుడ్ సరిపడా లేదని తెలిసి కూడా తినే అన్నాన్ని చెత్తబుట్టలో వేసిన ఆర్జే సూర్యకి నాగ్ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాడు. ఆరోహి అన్నం తినకుండా వెళ్లడంతో తాను అలా చేశాన‌ని చెప్పాడు సూర్య‌. అయితే ఆరోహి ప‌డేసిందా అంటే లేద‌ని అన్నాడు. అన్నం పడేసినందుకు పనిష్‌మెంట్‌గా ఈవారం మొత్తం ఆరోహితో మాట్లాడకూడ‌దు అంటూ సూర్య‌కు ప‌నిష్మెంట్ ఇచ్చారు నాగ్. ఇక ఆదిరెడ్డి మీద సైతం గ‌రం అయ్యారు . ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో ఒక్కొక్క హౌస్‌మేట్ పెర్ఫార్మెన్స్‌ను గురించి చెప్పుకొస్తూ నాగార్జున క్లాస్ పీకారు.

ఈవారం ఎలిమినేషన్‌కు 10 మంది నామినేట్ కాగా.. నేటి దసరా స్పెషల్ ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అయ్యేది తెలుస్తుందని నాగార్జున అన్నారు. అయితే శ‌నివారం ఎపిసోడ్‌లో అంద‌రు క‌లిసి చంటికి దారుణ‌మైన షాకిచ్చారు. నలుగురిని హోస్ట్ నాగార్జున నిలబెట్టగా, వారిలో ఒక్కరు ఈ సీజన్ మొత్తం కెప్టెన్ అయ్యే అర్హత కోల్పోతార‌ని చెప్ప‌గా, బాల‌దిత్య‌, రేవంత్‌ల‌ని సేవ్ చేసిన హౌజ్‌మేట్స్ ఇన‌య‌, చంటిల‌కు సేమ్ ఓట్స్ వేశారు. అయితే కెప్టెన్ కీర్తి.. చంటిని ఎంపిక చేయ‌డంతో ఈ సీజ‌న్ మొత్తం ఆయ‌న కెప్టెన్సీకి దూరం కానున్నాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News