Telugu Flash News

Chalaki Chanti: త‌ల్లి మంట‌ల్లో కాలిపోతే గుండెలు ప‌లిగేలా రోదించిన చంటి

chalaki chanti

Chalaki Chanti: బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు చ‌లాకీ చంటి. త‌న‌దైన కామెడీతో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ క‌డుపుబ్బ న‌వ్వించే చంటి జీవితంలో కూడా తీర‌ని విషాదాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం చంటి బిగ్ బాస్ హౌజ్‌లో సంద‌డి చేస్తుండ‌గా, ఆయ‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల గురించి చెప్పాడు. ఈ విష‌యాలు అంద‌రికి క‌న్నీరు తెప్పించాయి.

ముందుగానే చెప్పేస్తున్నాను నాకు ఆడవాళ్లు అంటే అసలు పడదు. నేను ఎవరిపై అభిమానం పెంచుకోను. ఉదయాన్నే నిద్ర లేచే సమయానికే నా కూతుళ్లు స్కూల్ కి వెళ్ళిపోతారు ,వాళ్ళు నిద్రపోయాక నేను ఇంటికి వ‌చ్చేస్తాను.

ఫుల్ ఎమోష‌న‌ల్..

వారికి ఏమైనా కావాలంటే కొనిస్తాను ఎక్కడికైనా కావాలంటే తీసుకెళ్తాను కానీ, వారికి ద‌గ్గ‌ర కాను. అందుకు కారణం నేను దగ్గర అయితే వాళ్ళు నాకు దూరం అవుతారని అనిపిస్తుంది.

నా చిన్నప్పుడే నాన్న చనిపోయారు. ఊహ తెలిశాక అమ్మ మంటల్లో కాలిపోయింది. ఆ తర్వాత అన్నయ్య, నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాం. కొంచెం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకున్నా. కొన్ని నెల‌ల‌కు గ‌ర్భ‌వ‌తి అయింది.

డెలివరీ సమయంలో ఆస్పత్రికి వెళ్ల‌గా, కూతురు పుట్టిందని తెలిసింది. ఎత్తుకోవాలని ఉన్నా భయంతో కింద టీ కొట్టు ఉంటే అక్కడికి వెళ్లి గంటన్నర ఏడ్చాను. కచ్చితంగా మా అమ్మే ఇద్దరిగా వచ్చింది. నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు.

తల్లిదండ్రుల అందరికీ నేను చెప్పేది ఒక్కటే.. తల్లిదండ్రులు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు స్వ‌యంగా అనుభ‌వించాను. ఓపిక లేకపోతే పిల్ల‌ల‌ని కనకండి. అడుక్కుతినండి కానీ, పిల్లలను రోడ్డుమీద వదిలేయకండి అని మాత్రమే” అని ఎమోషనల్‌ అయిపోయాడు చంటి.

మరిన్ని వార్తలు చదవండి :

bigg boss telugu season 6 : బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్‌కి దారుణ‌మైన‌ టీఆర్పీ రేటింగ్.. బిగ్ బాస్ చరిత్ర‌లో ఇదే తొలిసారి..!

 

Exit mobile version