HomecinemaChakri: చ‌క్రీది స‌హ‌జ మ‌ర‌ణం కాదంటూ ఆయ‌న త‌మ్ముడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Chakri: చ‌క్రీది స‌హ‌జ మ‌ర‌ణం కాదంటూ ఆయ‌న త‌మ్ముడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Telugu Flash News

Chakri: సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్రి త‌న కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ సాంగ్స్ అందించారు. తన ట్యూన్స్ తో క్లాస్, మాస్ అని తేడా లేకుండా, చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల వారిని, అన్ని వయసుల వారిని ఆకట్టుకున్న చక్రి.. ఊబకాయ సమస్యతో 2014 డిసెంబర్ 15న క‌న్నుమూసి తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌ని శోక‌సంద్రంలో ముంచాడు. అయితే ఆయ‌న‌ది స‌హ‌జ మర‌ణం కాదంటూ ఆయ‌న సోద‌రుడు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అన్న‌య్య మ‌ర‌ణం నుండి అమ్మ ఇంకా ఆ విషాదం నుంచి కోలుకోలేకపోతుందని, ఇంట్లో టీవీ పెట్టాలంటేనే భయం వేస్తుందని చ‌క్రి సోద‌రుడు మ‌హిత్ చెప్పుకొచ్చారు. అన్నయ్య భార్యతో జరిగిన గొడవల వల్ల తాము వేరే ఇంట్లోకి వెళ్లిపోయామని.. అన్న మరణంపై త‌న‌కు అనుమానం ఉందని మహిత్ అన్నారు. అమ్మ‌నే త‌న అన్న‌య్య‌ని చంపింద‌ని కొంద‌రు ప్ర‌చారం చేశారు.

కన్న తల్లి తన కొడుకుకు విషం పెట్టి ఎందుకు చంపుతుందని ఆయ‌న ప్ర‌శ్నించారు. తమ దురదృష్టం కొద్దీ అన్న ఎలా చనిపోయారనేది నిరూపించలేకపోయామని, అక్కడే తాను ఫెయిలయ్యానంటూ మ‌హిత్ భావోద్వేగానికి గుర‌య్యారు.

also read :

Sreemukhi Latest Hot Photos, Images, Stills, pictures 2023

Nabha Natesh Latest Photo gallery, Photoshoot, Images 2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News