Telugu Flash News

Kavitha: కవిత ఇంట్లో సీబీఐ బృందం.. విచారణ ఎలా సాగుతోందంటే..!

cbi questions mlc kavitha on delhi liquor scam

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత (Kavitha) ఇంటికి ఈరోజు సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు 11 మందితో కూడిన రెండు సీబీఐ బృందాలు కవిత నివాసానికి వెళ్లాయి. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో కవిత పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కవిత స్టేట్‌ మెంట్‌ను రికార్డ్‌ చేసుకొనేందుకు, ఆమె వివరణ తీసుకొనేందుకు సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు వచ్చారు. అయితే, ఈ కేసులో కేవలం సాక్షిగా మాత్రమే ఆమె స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్‌ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవిత విచారణ కోసం మొదట ఈనెల ఆరో తేదీని సూచిస్తూ సీబీఐ కవితకు లేఖ రాసింది. దీంతో ఆరోజు ముందుగానే నిర్ణయించిన కార్యక్రమం ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని కవిత సీబీఐకి లేఖ రాశారు. తర్వాత ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని లేఖలో కవిత పేర్కొన్నారు. ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ.. ఈరోజు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకొనేందుకు వచ్చారు.

ఉదయం నుంచి కవిత స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు తీసుకుంటున్నారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద కవిత వాంగ్మూలాన్ని అధికారులు తీసుకుంటున్నారు. ఈ కేసులో ఆమె నుంచి అనేక వివరాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే కవిత తన తండ్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ కేసు విషయమై ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయమై తండ్రితో చర్చించినట్లు సమాచారం. కేబినెట్‌ భేటీ తర్వాత కేసీఆర్‌తో కవిత మాట్లాడారు.

ధైర్యంగా ఎదుర్కోండి..

సీబీఐకి ఏం చెప్పినా ధైర్యంగా సమాధానాలు చెప్పాలని కేసీఆర్‌ సూచించినట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ శ్రేణులు కవితకు ధైర్యాన్ని నూరిపోశాయని తెలుస్తోంది. ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల పేరిట కేంద్ర ప్రభుత్వం తమను భయపెట్టాలని చూస్తే బెదిరేది లేదని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలంతా గంటాపథంగా చెబుతూ వస్తున్నారు. ఇటీవల మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌ తదతరుల ఆస్తులు, విద్యాసంస్థలు, మైనింగ్‌ కార్యకలాపాలపై దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేసిన నేపథ్యంలో శ్రేణులెవరూ అధైర్యపడొద్దని సీఎం సూచినట్లు తెలుస్తోంది.

also read news:

Prabhas : అన్‌స్టాపబుల్ సీజన్-2 టాక్ షో కి ప్రభాస్.. కన్ఫర్మ్ చేసిన ఆహా సంస్థ.. వీడియో వైరల్

Virat Kohli: ఇదేందో విచిత్రంగా ఉందిగా.. కోహ్లీ రెండు సెంచ‌రీలు రాహుల్ కెప్టెన్సీలోనే, అది కూడా సిక్స్‌తో…!

Exit mobile version