Telugu Flash News

క్యారెట్‌, బీట్‌రూట్‌, టమాటా కాంబో జ్యూస్‌.. పరగడుపున తాగితే లాభాలివే!

CARROT BEETROOT TOMATO juice

1. ఉదయాన్నే నిద్ర లేవగానే పరగడుపున కొన్ని రకాల జ్యూసులు తీసుకోవడం వల్ల అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. శరీరంలో రక్తానికి బీట్‌ రూట్‌ అవసరం.

2. బీట్‌రూట్‌ తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మెరుగు పడుతుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

3. రోజూ ఉదయం ఓ గ్లాసు జ్యూస్‌ తీసుకుంటే రక్తప్రసరణ సులువుగా సాగుతుంది. బీట్‌ రూట్‌, క్యారెట్‌, టమాటా కాంబో ట్రై చేయండి

4. చిన్న బీట్‌ రూట్‌ ముక్క, క్యారెట్‌ ముక్క, టమాటా ముక్క, కాస్త తాగునీరు కలిపి జ్యూస్‌ తయారు చేసుకోండి.

5. పరగడుపునే ఈ జ్యూస్‌ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు చూడొచ్చు. చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది.

6. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పేరుకుపోయి ఉంటే అది తొలగించడానికి ఈ జ్యూస్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

7. అధిక రక్తపోటు ఉన్న వారు ఈ జ్యూస్‌ను తాగడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది.

8. బీట్‌ రూట్‌ ‌జ్యూస్‌ తాగితే గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. ట్రైగ్లిజరైడ్స్‌ పేరుకుపోకుండా చేస్తుంది.

9. గర్భిణులు ఈ జ్యూస్‌ తాగితే ఫోలిక్‌ యాసిడ్‌ లభించి గర్భంలో శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

10. కంటి చూపు, జ్ఞాపక శక్తి కూడా పెరిగేందుకు ఈ జ్యూస్‌ దోహదపడుతుంది. విటమిన్లు, ఖనిజాలు, ఐరన్‌ తగినంత మోతాదులో లభిస్తుంది.

Also Read :

Rishabh Pant: రిష‌బ్ అభిమానులకి షాకింగ్ న్యూస్.. వ‌చ్చే ఏడాది కూడా పంత్ ఆడ‌డం డౌటే…!

పార్టీ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్దం : నటుడు ఆలీ

 

Exit mobile version