Bigg Boss 6 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మస్త్ రంజుగా సాగుతుంది. ఈ షో నుండి రీసెంట్‌గా గీతూ ఎలిమినేట్ కావడంతో గేమ్ లో కాస్త మజా అయితే తగ్గిందనే చెప్పాలి. నామినేషన్స్ అయితే రచ్చగా సాగగా, ఇక కెప్టెన్సీ టాస్క్ కూడా హోరెత్తి పోతుంది. ఇందుకోసం బిగ్ బాస్.. పాములు , నిచ్చెనల ఆట ఇచ్చారు.. బజర్ మోగగానే మట్టి కోసం పోటీపడటం.. అది తెచ్చుకుని పాములు, నిచ్చెనలు ఆర్ట్ వేయడం.. ఒకరిది ఒకరు చెడగొట్టడం ఇచ్చాడు. ఇది కూడా కాస్త ఫిజికల్ టాస్క్ కావడంతో వారి వారి బల ప్రదర్శన చేశారు.
రచ్చగా మారిన టాస్క్..
అయితే కీర్తి వేలుకి దెబ్బ ఉన్న కారణంగా ఈ టాస్క్‌లో తాను ఆడలేకపోయినందుకు కీర్తి బాధపడింది. ఇక రేవంత్ అయితే గట్టి పోటీ ఇస్తుండగా, మిగతా వాళ్లు కూడా మట్టిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇనయా. ఫైమా మధ్య గొడవ మాటల నుంచి తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు ఫైటింగ్ చేసుకునేలా కనిపించారు. ముఖ్యంగా ఇనయాను ఫైమా తన మట్టి తీసుకోనీయకుండా ఉండుం పట్టు పట్టుకుని తన మట్టిని బాగానే కాపాడుకుంది. ఇక ఇనయా గేమ్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు రేవంత్ ఆమెని ఓదార్చాడు.
మిగతావారంతా ఎవరిగేమ్ వారు ఆడుతుండగా, గేమ్ నుంచి వాసంతి, ఇనయా బయటకు వచ్చేశారు. అంతకు ముందు రోహిత్, శ్రీ సత్యలు కూడా ఎలిమినేట్ పోయిన విషయం తెలిసిందే. అయితే ఎలిమినేషన్ ను తట్టుకోలేకపోయిన ఇనయా మళ్ళీ తిండి తినకుండా.. బెడ్ రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. ఇక గేమ్ లో అంతో ఇంతో ప్రయత్నం చేసినవాళ్లలో బాలాదిత్య ఉండగా, అతను శ్రీహాన్ దగ్గర నుంచి మట్టి తీసుకోవడనికి చాలా ట్రై చేశాడు. రాజ్ కాని, రేవంత్ కాని, శ్రీహాన్ కాని.. వారి గేమ్ వారు అద్భుతంగా ఆడుతున్నారు. ఇక గీతూ వెళ్లాక ఆదిరెడ్డి సోలో అయ్యాడు. ఎవరితో కలవకుండా.. తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు.
also read these news:
horoscope today : 9-11-2022 బుధవారం ఈ రోజు రాశి ఫలాలు
ICC: సెమీస్‌కి భారత్, పాక్ వెళ్లడం వెనక ఐసీసీ స్కెచ్ ఉందా.. అభిమానుల్లో ఎన్నో సందేహాలు..!