Homebigg boss telugu season 6bigg boss 6: బిగ్ బాస్ షో లో తొలిసారి గీతూ ఏడ్చేసింది.. అసలేం జరిగింది ?

bigg boss 6: బిగ్ బాస్ షో లో తొలిసారి గీతూ ఏడ్చేసింది.. అసలేం జరిగింది ?

Telugu Flash News

బిగ్ బాస్ (bigg boss 6) షో వారాలు గడుస్తున్నా కొద్ది ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఫ్యామిలీకి దూర‌మ‌య్యామ‌నే బాధ‌తో కొంత మంది ఎమోష‌న‌ల్ అవుతుండ‌గా, మ‌రి కొంత మంది కంటెస్టెంట్స్ అనే మాట‌ల‌కు హ‌ర్ట్ అయి క‌న్నీరు కారుస్తున్నారు. సోమ‌వారం నామినేషన్స్ చాలా వాడివేడిగా సాగ‌గా, ఈ వారం అంద‌రు నామినేష‌న్స్‌లో ఉన్నారు. దీంతో క‌సితో గేమ్ ఆడేందుకు సిద్ధ‌మ‌య్యారు.

అయితే ఎప్పుడు అన్నిటికి ముందుండే గీతూ మాత్రం టాస్క్ లో అందరికంటే వెనకబడింది. ఇక ఇనయా, రేవంత్ జంటగా రెచ్చిపోయి గేమ్ ఆడారు. రెండు సార్లు వారే విన్నర్స్ గా నిలిచారు.

bigg boss 6 షో లో రచ్చ ర‌చ్చ‌..

చేపల టాస్క్ పేరుతో ఇంటి సభ్యులను బిగ్ బాస్ జంటలుగా విడదీసి ఇచ్చాడు. ఆకాశం నుంచి చేపలు పడడం.. వాటిని హౌస్ మేట్స్ పట్టుకొని బుట్టల్లో దాచుకోవ‌ల్సిందిగా చెప్పాడు. అయితే చేపల వర్షం పడుతుంటే వాటిని పట్టుకోవడానికి హౌస్ మేట్స్ ప్రాణాలకు తెగించారనే చెప్పాలి.

ఇక బుట్టలో దాచుకున్న చేపలను ఒకరివి ఒకరు లాక్కోవడం.. దొంగిలించడం ప్ర‌తి సీజ‌న్‌లో మాదిరిగానే జ‌రిగిది. అయితే గీతూ వేరే వాళ్ల బుట్టలోంచి చేప‌లు తీయ‌డం మొదలుపెట్టగానే అందరూ వచ్చి ఆమె బుట్టలోనే చేపలను ఎత్తుకెళ్లారు. దీంతో అందరి బుట్టలపై పడి గీతూ, ఆదిరెడ్డి నానా రచ్చరచ్చ చేశారు.

geetu in bigg boss 6అయితే గీతూ ప్లాన్ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో తొలిసారి కంటనీరు పెట్టుకొని ఏడ్చేసింది. అంతటి బలమైన కంటెస్టెంట్ ను కూడా ఏడిపించిన ఘనత ఈ బిగ్ బాస్ చేపలకే దక్కిందని చెప్పాలి. ఇక ఆట‌లో గీతూ నీయబ్బ అన్న మాటను ఉపయోగించడం చర్చనీయాంశం అయ్యింది. అయితే తన స్లాంగ్ వల్ల అలా అనిపించింది కాని తాను కావాలని ఆ మాట అనలేదంటూ మరో కన్వింస్సింగ్ సమాధానం వినిపించింది.

మరో వైపు రేవంత నీ అమ్మ అంటూ అన్నాడన్న మాటపై కూడా చర్చ న‌డిచింది. విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇక బండి నెట్టే టాస్క్ లో రాజ్ కు రేవంత్ కు మధ్య వాగ్వాదం జరిగింది. అటు బాలాదిత్య- శ్రీ సత్య మధ్య కూడా చిన్న‌చిన్న డిష్యూం అయింది ట. ఈ టాస్క్ లో ఇప్పటికే ఆదిరెడ్డి, గీతూ ఎలిమినేట్ అయ్యారు. మరి ఈవారు కెప్టెన్ ఎవరు అనేది నేడు తెలియ‌నుంది.

-Advertisement-

ఇవి కూడా చదవండి :

horoscope today: అక్టోబర్ 26, బుధవారం ఈ రోజు రాశి ఫలాలు 2022

ఈ పండక్కి శనగపప్పు హల్వా చేసుకొండిలా..అచ్చం పుల్లారెడ్డి స్వీట్ లా..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News