Homecinema‘యశోద’ సినిమా తో సమంత హిట్ కొడుతుందా ? విశ్లేషకులు ఏం చెప్తున్నారు ?

‘యశోద’ సినిమా తో సమంత హిట్ కొడుతుందా ? విశ్లేషకులు ఏం చెప్తున్నారు ?

Telugu Flash News

‘యశోద’ సమంత నుండి వస్తున్న కొత్త సినిమా వచ్చే నెల 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటి, ప్రేక్షకుడు థియేటర్ వరకు వచ్చి చూసేందుకు ఇందులో కొత్తదనం ఏముంది అంటే ఇది కేవలం సమంతా నటిస్తున్న థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమా అని సినిమా యూనిట్ చెప్తున్నారు. ఇందులో నటిస్తున్న మిగతావారి గురించి పెద్దగా తెలీదు కాబట్టి ఈ సినిమాకు సెంటర్ అఫ్ అట్రాక్షన్ సమంతానే.

అయితే ఈ సినిమాకు అదే ప్లస్ కావచ్చు అదే మైనస్ కూడా కావచ్చు. అందులోను ఈ సినిమా వస్తున్న సమయం కూడా పెద్దగా అనుకూలంగా లేదు. నవంబర్ నెల చివరిలో మరియు డిసెంబర్ లో భారీ సినిమాల రానున్నాయి.

అందుకే ప్రేక్షకుడి దృష్టి అంతా ఆ సినిమాల పైనే ఉండడం వలన పైగా ముందు నెలల్లో హిట్ అయిన చాలా సినిమాల ఓటిటి రిలీజ్ లు ఉండడం మూలానా అక్టోబర్ 21 నుండి నవంబర్ వరకు డ్రై సీజన్ అని సినిమా విశ్లేషకులు చెప్తున్నారు.

సమంతా నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు తనే ప్రధాన పాత్రలో చేసిన ‘ఓ బేబీ’, ‘ యు టర్న్ ‘ లాంటి హిట్ సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి. అయితే అదంతా గతం 2021లో సమంతా విడాకులను ప్రకటించినప్పటి నుండి ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు చాలామంది అక్కినేని అభిమానులు.

ఈ సినిమా ఫలితం ఆమెకు చాలా ముఖ్యం ఒకవేళ ఈ సినిమా గనక ఆశించినంత స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోతే ఆమెకు అవకాశాలు బాగా తగ్గిపోవచ్చు. ఆమె ఓడిపోవాలని చూస్తున్న చాలామంది ఈ సినిమా ఫలితాన్ని గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

-Advertisement-

Cancer Causing Foods: ఈ 7 ఆహారాలు క్యాన్సర్ కారకాలు

viral video: పాండా ప్ర‌య‌త్నం విఫ‌లం.. బొక్క‌బోర్లా ప‌డిందిగా..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News