MS Dhoni: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అయితే రెండేళ్ల క్రితం తాను అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పగా, ఐపీఎల్‌లో మాత్రం సందడి చేస్తున్నాడు.
గత సీజన్‌లో బ్యాట్‌తో బాగానే రాణించిన ధోని తనలో సత్తా ఇంకేమి తగ్గలేదని నిరూపించాడు. అయితే ధోని ఐపీఎల్‌కి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొద్ది రోజులుగా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. సొంతమైదానంలో ఆడిన తర్వాతే ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని ధోనీ ఈ వార్తలకు చెక్ పెట్టాడు.
దీంతో అభిమానులు ఖుష్ అయ్యారు. అయితే ఏమైందో కాని, ఈ రోజు మధ్యాహ్నాం 2 గంటలకు ధోని ఫేస్ బుక్‌లో లైవ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు.
ఈ రోజు మధ్యాహ్నాం ఏం జరగనుంది?
ధోని అనౌన్స్‌మెంట్‌తో అందరు ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం ఊపందుకుంది. సౌతాఫ్రికా వేదికగా జరగనున్న టీ20 లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన జోహన్నెస్ బర్గ్ జట్టు తరఫున మెంటార్‌గా ఉండేందుకే ధోనీ ఈ నిర్ణయం తీసుకుంటున్నాడా? అని అందరు ఆలోచనలో పడ్డారు.
ఇప్పటికే విదేశీ లీగ్స్ ఆడేందుకు రైనా, ఊతప్పలు భారత్‌లోని అన్నిరకాల క్రికెట్‌కి గుడ్ బై చెప్పగా,వారి బాటలోనే ధోని పయనిస్తాడా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధోనీ పోస్ట్ మమల్ని భయపెడుతుందని కామెంట్ల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం ధోనీ రిటైర్మెంట్ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇక రీసెంట్‌గా తాను గ్రౌండ్‌లో ఉన్నప్పుడు ఎందుకు కోపడడో చెప్పుకొచ్చాడు. మీరందరూ ఎలా అనుకుంటారో నాకు కూడా లోపల అలాగే అనిపిస్తుంది. మేము మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. తప్పులు జరిగితే మేం చాలా హర్ట్ అవుతాం.
అయితే గ్రౌండ్ బయట నుండి చెప్పే అంత ఈజీగా లోపల ఉండదు. మేం ఎలాగైతే జాతీయ జట్టు తరపున ఆడుతున్నామో ప్రత్యర్ధులు కూడా అంతే రేంజ్‌లో ఆడుతుంటారు. కాబట్టి ప్రెషర్ తప్పక ఉంటుందని చెప్పుకొచ్చాడు ధోని.