Telugu Flash News

T20 Worldcup Final: ఇంగ్లండ్‌పై గెలిస్తే పాక్ కెప్టెన్ ప్ర‌ధాని అవుతాడా.. ఇదేం ట్విస్ట్‌…!

T20 Worldcup Final: ఈ రోజు ఇంగ్లండ్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైట్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అస‌లు సెమీస్‌కి కూడా రాద‌నుకున్న పాకిస్తాన్ అనూహ్యంగా సెమీస్‌లో న్యూజిలాండ్ పై గెలిచి ఫైన‌ల్ చేరుకున్న విష‌యం తెలిసిందే.

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుండ‌గా, ఇక, ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ జట్టు ఇదే విధంగా 1992లో ఇంగ్లాండ్‌‌ను ఓడించి తొలిసారి ప్రపంచకప్‌ను ద‌క్కించుకుంది. ఈ నేపథ్యంలో రెండు ప్రపంచ కప్‌ల మధ్య సారూప్యత గురించి చాలా మీమ్స్, జోకులు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. ఈ క్ర‌మంలో పాక్ కెప్టెన్‌ను ఉద్దేశించి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఆక‌ట్టుకుంటున్నాయి.

నిజం అవుతుందా?

ఈ టోర్నీలో ఒకవేళ పాకిస్థాన్ క‌నుక‌ విజయం సాధిస్తే.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 2048లో ఆ దేశానికి ప్రధాని అవుతారని చమత్కరించారు. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో పాక్ గెలిచిన 1992 50-ఓవర్ల వరల్డ్ కప్ జ‌ర‌గ‌గా, గ్రూప్ దశలో పాక్ పేలవ ప్రదర్శన క‌న‌బ‌ర‌చి, చివరిలో అద్భుతంగా పుంజుకుని వరుసగా 3 మ్యాచులను గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది.

అప్పుడూ సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. యాదృచ్ఛికంగా 1992 ప్రపంచ కప్‌లో ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడ‌గా, వసీం అక్రమ్ అద్భుత ప్రదర్శనతో పాక్ విజయం సాధించి మొదటిసారి ప్రపంచ విజేతగా నిలిచింది.

జ‌ట్టుకు వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ అందించిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు పాకిస్తాన్‌కి అధ్య‌క్షుడిగా ఉన్న నేపథ్యంలో ఇదే సెంటిమెంట్‌తో బాబ‌ర్ ఆజ‌మ్ కూడా 2048లో ప్ర‌ధాని అధ్య‌క్షుడు అవుతాడేమోన‌ని గ‌వాస్క‌ర్ చ‌మ‌త్క‌రించారు.

కాగా, 1992, 2022 ప్రపంచ కప్‌ల గ్రూప్ దశల్లో మెల్ బోర్న్ మైదానంలో ఆడిన తొలి మ్యాచ్‌లో పాక్ ఓడిపోయింది. అలాగే, రెండుసార్లూ భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమి చవిచూసింది. మ‌రి ఈ రోజు వాటిని పాకిస్తాన్ తిర‌గరాస్తుందా లేదా అనేది చూడాలి.

also read news:

Sneha: స్నేహా కూడా త‌న భ‌ర్త నుండి విడాకులు తీసుకోబోతుందా.. ఇదీ అస‌లు క్లారిటీ!

రన్నింగ్ చేసే ముందు… ఇవి తప్పక తెలుసుకోండి

Exit mobile version