Air India: ఇటీవల విమానాల్లో చోటు చేసుకుంటున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. అనేక ఎయిర్‌లైన్స్‌సంస్థలకు చెందిన విమానాలు మొరాయిస్తున్నాయి. దీంతో విమాన ప్రయాణమంటేనే ప్రయాణికులు జడుసుకోవాల్సి వస్తోంది.
తాజాగా 150 మందికి పైగా ఎయిర్ఇండియా ప్రయాణికులు మహారాష్ట్రలోని పుణె నుంచి ఢిల్లీకి చేరుకోవడానికి దాదాపు 24 గంటల సమయం పట్టింది. గురువారం రాత్రి దేశ ఢిల్లీ రన్ వేపై దిగడానికి బదులు ఎయిర్ ఇండియా విమానం రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్‌కు వెళ్తోందని పైలెట్ అనౌన్స్ చేశాడు.
దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ కావడంతో ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. అక్కడ మూడు గంటల పాటు ప్రయాణికులు గడిపారు.
అనంతరం రోడ్డు మార్గంలో దాదాపు 24 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకోవాల్సి వచ్చింది. ఎయిర్ ఇండియా (ఏఐ-850) విమానం గురువారం సాయంత్రం 6.50 గంటలకు టేకాఫ్ అయ్యింది. తర్వాత ఢిల్లీలో రాత్రి 9.05 గంటలకు ల్యాండింగ్ అవ్వాల్సి వచ్చింది.
అయితే, శుక్రవారం సాయంత్రం దాదాపు ఆరు గంటలకు ఢిల్లీకి చేరుకున్నట్లు ముఖద్దాస్ అన్సారీ వెల్లడించారు. ఢిల్లీ శివార్లలో విమానం ల్యాండ్ అయ్యే సరికి ఆకాశంలో పొగలు కమ్మేశాయని పేర్కొన్నారు. దీంతో వాతావరణం అనుకూలించక జైపూర్ తరలించినట్లు పైలెట్ పేర్కొన్నారు.
Read Also : Asiana Airlines: అత్యవసర డోర్ తెరిచిన ప్రయాణికుడు.. గాల్లోనే తెరుచుకున్న విమానం విండో!