Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో యాక్టీవ్ గా ఉంటూనే.. ఇటు వరుస సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న పవన్.. ఆ తర్వాత వెంటనే హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ చేయనున్నాడని సమాచారం.
మరోవైపు వినోదయ సితం రీమేక్, డైరెక్టర్ సుజిత్ తో ఓజి సినిమాలు కూడా లైనప్ లో పెట్టేశాడు. త్వరలోనే ఈ సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో ముందుగా వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది.
తేరి సినిమాకి రీమేక్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతుందని తెలుస్తుండగా, తేరి సినిమాలో విజయ్ కూతురి పాత్రలో నటి మీనా కూతురు నటించింది. ఇప్పుడు ఇందులో పవన్ కళ్యాణ్ కూతురి పాత్రను అల్లు అర్జున్ గారాలపట్టి.. అల్లు అర్హ పోషించనుందని టాక్ నడుస్తోంది.
ఆల్రెడీ అర్హ శాకుంతలం సినిమాలో నటించింది.. సో.. పవన్ కూతురి పాత్ర కోసం అల్లు అర్హ బెటర్ అని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది మరి కొద్ది రోజులలో క్లారిటీ రానుంది.
also read:
Roja Fire on Lokesh : లోకేష్‌ది ఐరన్ లెగ్.. చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉందన్న రోజా
H-1B Visa : స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు ఢోకా లేదు.. మళ్లీ హెచ్1బీ వీసా అప్లికేషన్ల ప్రక్రియ షురూ!