HomesportsIndia: టీమిండియా అభిమానులు ఇక ఊపిరి పీల్చుకోండి... కింగ్ ఈజ్ బ్యాక్

India: టీమిండియా అభిమానులు ఇక ఊపిరి పీల్చుకోండి… కింగ్ ఈజ్ బ్యాక్

Telugu Flash News

India: ప్ర‌స్తుతం టీమిండియాకి బౌలింగ్ ప్రధాన స‌మ‌స్య‌గా మారిన విష‌యం తెలిసిందే. ఆసియా క‌ప్‌, వర‌ల్డ్ క‌ప్ లో ఇది స్ప‌ష్టంగా క‌నిపించింది. ముఖ్యంగా బుమ్రా గాయంతో ఈ టోర్నీల‌కు దూరం కావ‌డంతో బుమ్రా లేని లొటు స్ప‌ష్టంగా క‌నిపించింది. చివ‌రి ఓవర్స్‌లో యార్క‌ర్లు సంధిస్తూ బ్యాట్స్‌మెన్స్ ని తెగ ఇబ్బంది పెట్టేవాడు బుమ్రా. ఆయ‌న లేక‌పోవ‌డంతో మిగ‌తా బౌల‌ర్స్ ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. ఆసియా కప్ సమయంలో తగిలిన ఎదురుదెబ్బ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది.. టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ లోనే ఇంటిదారి పట్టడం విమర్శలకు తావివ్వ‌గా, ఇప్ప‌టికీ టీమిండియాపై విమర్శల పరంపర కొనసాగుతోంది. దీంతో జట్టును మార్చాలని బీసీసీఐ యోచిస్తోంది.

టీమిండియా ఓటమికి ప్రధాన కారణం మన బౌలింగ్ సరిగా లేకపోవడమే అని త‌ప్ప‌క చెప్పాలి. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో దెబ్బతిని ఇంటి దారి పట్టిందంటే బౌలింగ్ లోప‌మే. రీసెంట్‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోను బౌలింగ్ లోపం వ‌ల‌న టీమిండియా ఓడిపోయింది. అయితే ప్రస్తుతం బుమ్రా తిరిగి ఫిట్ నెస్ సాధించడంతో ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా విడుదల కాగా, టీమిండియా అభిమానులు ఇప్పుడు ఖుషి అవుతున్నారు. ఇన్నాళ్లు ఓటములతో నిరాశపడిన వారికి బుమ్రా మందు టానిక్ లా పనిచేయనుంద‌ని అంట‌న్నారు.

బుమ్రా అందుబాటులో లేకపోవడంతో మ‌న బౌలింగ్ చప్పగా మారింది. మన బౌలర్లను ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం బుమ్రా తిరిగి వన్డే జట్టులోకి రావడంతో ఇక ప్రత్యర్థుల పని పట్టేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. వచ్చే రెండేళ్లు టీమిండియాకు కష్టకాలం కావడంతో వన్డే, వచ్చే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ తో పాటు 2024లో టీ20 మెగా టోర్నీ జరగనుంది.ఈ క్ర‌మంలో బుమ్రాతోపాటు మరికొందరు బౌలర్లు ప్రభావం చూపించాల్సిన అవసరం ఏర్పడింది. అన్ని మ్యాచుల్లో ఒక్కడే ప్రభావం చూపలేడు కాబ‌ట్టి ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్, యష్ దయాళ్ వంటి యువతను రాటుదేలేలా త‌యారు చేయాలి. ఏదేమైన బుమ్రా తిరిగి రావ‌డం టీమిండియా క‌ష్టాలు కాస్త తీరిన‌ట్టు అని చెప్పాలి.

మరిన్ని చదవండి :

స్వామి మాలలో ప్ర‌భాక‌ర్ కొడుకు చంద్రహాస్‌ పోజులు.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్

-Advertisement-

Bigg Boss 6: హౌజ్‌లోకి సోహైల్.. సిరి, శ్రీహాన్ మ‌ధ్య చిచ్చు పెట్టి క‌థ మొత్తం మార్చేశాడుగా..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News