Crime News : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్న తన సోదరిపై యువకుడు కోపోద్రిక్తుడై రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. రాయి తగిలి చనిపోయి ఉంటుందని నమ్మించి హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు చెప్పడం తో విషయం బయటపడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. అజ్మీరా సింధు (21) అలియాస్ సంఘవి మహబూబాబాద్‌లో ఏఎన్ఎం అప్రెంటీస్‌గా చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, వీడియోలు పోస్ట్ చేయడం సోదరుడు హరిలాల్ కి నచ్చలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి కూడా ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన హరిలాల్ తన సోదరిని ఇంట్లో ఉన్న రోకలిబండతో తో తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు.
సింధు పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మంగళవారం ఉదయం హడావుడిగా ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య కోణం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న హరిలాల్ కోసం గాలిస్తున్నారు.
also read :