Rishi sunak : భారతీయులు తమ బతుకు తెరువు కోసం దేశాన్ని వదిలి వెళ్ళినా గొప్ప పనులతో గొప్ప పదవులు దక్కించుకుని బయట వారికి మన గొప్పతనం గురించి తెలియ చేయడంలో మాత్రం ఎల్లప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు.అలా భారత దేశం నుంచి వెళ్లి సంచనలం సృష్టించిన వారిలో రిషి సునాక్ కూడా ఒకరు.
ఆయన కుటుంబం విషయానికి వస్తే ఆయన పూర్వీకుల మూలాలు పంజాబ్లో ఉండగా వాళ్ళు తొలుత పంజాబ్ నుంచి తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారట. అక్కడ సంతానం కల్గిన తర్వాత పిల్లలతో కలిసి ఇంగ్లండ్ కి వెళ్లి అక్కడే స్థిరపడ్డారట.
యశ్వీర్,ఉష దంపతులకు 1980, మే 12న సౌథాంప్టన్లో జన్మించిన రిషి సునాక్ చిన్న తనం నుంచి చదువులో ముందే ఉండేవారట. ఎప్పుడూ ఎవరి మీదా ఆధార పడకూడాదని బావించే రిషి పాకెట్ మనీ కోసం విద్యార్థిగా ఉన్న సమయంలోనే ఓ భారతీయ రెస్టారంట్లో వెయిటర్ గా పని చేశారట.
ఇన్ఫోసిస్ ఫౌండర్ , కర్ణాటకు చెందిన నారాయణ మూర్తి , సుధా మూర్తి దంపతుల కుమార్తె అక్షతా మూర్తిని August 2009 లో రిషి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
రాజకీయాల్లోకి అడుగు
ఇక రాజకీయల విషయానికి వస్తే రిషి సునాక్ తాను చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్ పార్టీలో ఇంటర్న్షిప్ చేశారట. ఆ తర్వాత 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్మాండ్ నుంచి ఎంపీ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
2019లో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ కు రిషి సునాక్ నమ్మకస్తుడు కావడంతో ఆయనకు ఆర్థిక శాఖలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారట. అక్కడ నుంచి తన వ్యక్తిత్వంతో, తెలివితో కొద్ది కాలంలోనే అందర్నీ మెప్పించి “రైజింగ్ స్టార్” మినిస్టర్ గా పేరు తెచ్చుకున్న రిషి సునాక్
2020లో ఛాన్సలర్‌గా పదోన్నతి సాధించారు.
అలా ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్య పరుస్తూ ముందుకు సాగిన రిషి సునాక్ 2022,అక్టోబర్ 25న బోరిస్ జాన్సన్, పెన్నీ మోర్డౌండ్లను పక్కకు నెట్టి బ్రిటన్ ప్రధాని పదవిని సొంతం చేసుకుని అందర్నీ అవాక్కయ్యేలా చేశారు.
ఎంత ఎదిగినా తన దేశ మూలాలను మర్చిపోని రిషి తను హిందువునని గర్వంగా చెప్పుకుంటూ ఇప్పటికీ తన భార్య అక్షతతో కలిసి “గోవు పూజలు” చేస్తుంటారట.
అయితే నెట్టింట్లో కొంత మంది నెటి జనులు రిషి సునాక్ భారతీయుడైనంత మాత్రాన మనకు ఒరిగేది ఏమీ లేదని తను తన దేశం గురించి పట్టించుకుంటాడు కానీ మన దేశం గురించి ఎందుకు పట్టించుకుంటాడని వారి వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
ఏదేమైనా మన దేశం వాడు వేరే దేశానికి వెళ్ళి ప్రధాని స్థాయికి ఎదిగాడంటే మనకి గర్వంగానే ఉంటుంది కదా..
also read news: