భారతీయ మూలాలున్న రిషి సునాక్ (Rishi Sunak) కొన్నాళ్ల కిందట బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్‌ను కాపాడటానికి నాయకత్వం వహిస్తున్నారు రిషి సునాక్. తాజాగా సునాక్ నిర్ణయాలు, పాలనా వ్యవహారాలపై కొత్త అంశాలు వెలుగు చూశాయి. రిషి సునాక్ నాయకత్వంపై ఆ దేశ ప్రజలు అధిక విశ్వాసం వ్యక్తం చేశారని తాజా సర్వేలో తేలింది.
బ్రిటన్ ప్రధాని అంశంలోనూ అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో మొదలైన హై డ్రామా.. తర్వాత బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ పదవీ బాధ్యతలు చేపట్టడం, అనంతరం ఆమె కూడా రాజీనామా చేయడం, తర్వాత భారత మూలాలున్న రిషి సునాక్ బాధ్యతలు చేపట్టే వరకు వెళ్లింది. ఇప్పటికి బ్రిటన్‌లో కాస్త పరిస్థితి కుదుటపడింది.
ఆర్థికపరంగా నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థత చూపడం, పాలన వ్యవహారాల్లో ప్రస్తుత ప్రధాని రిషి సునాక్.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కన్నా మెరుగైన, చురుకైన పాత్ర పోషిస్తున్నారని తేలింది. ఈ విషయం తాజాగా సవంతా కామ్‌రెస్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రిషి, బోరిస్ ఇద్దరూ టోరీ పార్టీకి చెందిన నేతలు. 2024లో ఎన్నికలను ఎదుర్కోవడంపై ఓటర్ల అభిప్రాయాలను సర్వే నిర్వాహకులు సేకరించారు.
రిషి సునాక్ (Rishi Sunak) వైపే మొగ్గు..
2019లో టోరీ పార్టీకి పట్టం కట్టిన ఓటర్లు.. వచ్చే ఎన్నికల్లో మొగ్గుచూపడం లేదని సర్వేలో వెల్లడైంది. సుమారు 63 శాతం మంది సర్వేలో పాల్గొన్న ఓటర్లు.. బోరిస్ నాయకత్వాన్ని వ్యతిరేకించారని తేలింది. 24 శాతం మంది మాత్రమే ఆయన అభ్యర్థిత్వానికి సానుకూలత వ్యక్తం చేసినట్లు సర్వే వెల్లడించింది. అయితే, రిషి సునాక్ పాలన, నిర్ణయాలపై 43 శాతం మంది మద్దతు తెలిపినట్లు తేలింది. రిషి టోరీ పార్టీని కాపాడగలడని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందులో రిషి పాలన కూడా బోరిస్ మాదిరే ఉందంటూ 19 శాతం మంది పేర్కొన్నారు. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నిర్వహించేది ఎవరనే అంశంపై సునాక్‌కు 44 శాతం, బోరిస్‌కు 19 శాతం మంది మద్దతు దక్కింది.
also read news:
undavalli arun kumar : పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి? ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు!
Rohit Sharma: మతిమరుపు రోహిత్ శర్మ.. పరీక్ష హాల్‌లో స్టూడెంట్ కూడా అంతేనంటూ మీమ్స్