Homeviral newsViral Video: ప్ర‌కృతి ప్ర‌కోపం.. కిలోమీట‌ర్ల మేర కుప్ప‌కూలిన ఫ్లై ఓవ‌ర్

Viral Video: ప్ర‌కృతి ప్ర‌కోపం.. కిలోమీట‌ర్ల మేర కుప్ప‌కూలిన ఫ్లై ఓవ‌ర్

Telugu Flash News

Viral Video: ప్ర‌కృతి చాలా ప్ర‌శాంతంగా ఉంటుంది. కాని ఆగ్ర‌హిస్తే ఆ ప‌రిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌కృతి ఆగ్ర‌హానికి చాలా మంది జీవితాలు అల్ల‌క‌ల్లోలం అయ్యాయి. అయితే సునామీ, భూకంపం, భారీ వర్షాలు.. ఇవన్నీ ప్రకృతి సృష్టించే వినాశనాకి సాక్ష్యాలుగా చెప్పుకోవ‌చ్చు.

తైవాన్ దేశంలో ప్ర‌కృతి ప్ర‌కోపించ‌డంతో భ‌యంక‌ర‌మైన దృశ్యాలు క‌ళ్ల‌ముందుకు సాక్షాత్క‌రిస్తున్నాయి. వాటిని చూసి ప్ర‌తి ఒక్క‌రు భ‌య‌బ్రాంతుల‌కి గురవుతున్నారు.

విధ్వంసం..

తాజాగా తైవాన్‌ దేశం వరుస భూకంపాల కారణంగా అతలాకుతలమవుతోంది. ఇటీవ‌ల సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.4గా నమోదు కాగా, ఆ త‌ర్వాతి రోజు 6.9 తీవ్రతతో భూమి కంపించింది.

భూకంపం తీవ్రతకు భవనాలు పేక మేడళ్లా కూలిపోగా, రైళ్లు బొమ్మలా ఊగిపోతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

అంతేకాకుండా ఓ వీడియోలో కిలో మీట‌ర్ల మేర కుప్ప‌కూలిన దృశ్యాలు క‌నిపిస్తుండ‌గా, ఫ్లై ఓవర్ ధ్వంస‌మైన తీరు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.

సౌత్‌ఈస్ట్రర్న్‌ ప్రాంతంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్‌ పూర్తిగా ధ్వంసం కావ‌డంతో రూ. వేల కోట్ల నష్టం వాటిల్లింది. తైవాన్‌లో భూకంపం దాటికి పాఠశాలలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి.

-Advertisement-

అయితే భూకంపంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. ఇప్పటికే 12 వేల మందిని ప్రత్యేక కేంద్రాలకు తరలించగా, మ‌రి కొంద‌రిని త‌ర‌లించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక భూకంపం వల్ల రహదారులు మూసుకు పోయి 600 మంది చిక్కుకుపోయారు. కొన్ని చోట్ల రైళ్లు ప‌ట్టాలు త‌ప్పాయి.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News