Telugu Flash News

Breaking News : విడాకులు తీసుకున్న నిహారిక – చైతన్య.. అధికారికంగా విడిపోయారు

నటి, నిర్మాత నిహారిక కొణిదెల(niharika konidela), చైతన్య జొన్నలగడ్డ (chaitanya jonnalagadda) వివాహ బంధం విడాకులతో ముగిసింది. ఈ మేరకు వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. పరస్పర అంగీకారంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టు (kukatpally family court) లో దరఖాస్తు చేసుకోగా, కోర్టు విడాకులు మంజూరు చేసింది.

వారి సోషల్ మీడియా ఖాతాల నుండి వారు కలిసి ఉన్న చిత్రాలను తొలగించడంతో ఈ వార్త మరింత బలపడింది. మరోవైపు మెగా ఫ్యామిలీలో జరిగిన అన్ని వేడుకలకు నిహారిక ఒక్కరే హాజరు కావడం చర్చకు దారి తీసింది. దీనిపై ఎవరూ స్పందించలేదు.

నటుడు మరియు నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డల నిశ్చితార్థం ఆగస్టు 2020లో జరిగింది.

డిసెంబర్ 2020లో వారి వివాహానికి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ వేదిక అయ్యింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక తాజాగా ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది.

also see :

Sreemukhi Latest Hot and Cute Photos Collection 04.07.2023

Shriya Saran Latest Hot Instagram Photos 04-07-2023

Exit mobile version