తారక రత్న కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యారు. కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స కొనసాగుతుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ రోజు నుండి మొదలయిన టీడీపీ యువ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో లోకేష్ తో పాటు తారకరత్న కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలికారు. అయితే.. అనుకోని విదంగా సినీనటుడు తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.
లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న ఉన్నట్టుండి వాహనం పై నుండి స్పృహ తప్పి పడిపోయారు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి శరీరం అంతా నీలి రంగులోకి మారిందని చెప్తున్నారు. చికిత్స కోసం కుప్పం కేసి ఆసుపత్రి కి తీసుకెళ్ళి అటుపై మరో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. నందమూరి బాలకృష్ణ చేరుకుని పరిస్థితి ని తెలుసుకున్నారు.
ఇంత అభిమానమా..
లోకేష్ పాదయాత్రలో అభిమానుల తాకిడికి తారకరత్న తట్టుకోలేకపోయారు. అప్పటికే తనకు గాలి ఆడటం లేదని చెప్తున్నా ఎవరు వినకపోవడం తో స్పృహ తప్పి పడిపోయారు.
also read :
Lokesh Padayatra: నేటి నుంచే యువగళం పాదయాత్ర.. సుదీర్ఘ ప్రయాణానికి నారా లోకేష్ తొలి అడుగు