Telugu Flash News

Bottle Gourd: సొర‌కాయ తినేవారు త‌ప్ప‌క ఇది చ‌దివి తీరాల్సిందే..!

Bottle Gourd: ఆఫ్రికాలో పుట్టిన సొర‌కాయ‌ని మ‌న తెలంగాణ‌లో తిగ తినేస్తుంటారు. మ‌న ద‌గ్గ‌ర సొర‌కాయ‌ని ఆన‌ప‌కాయ అని పిలుస్తారు. దీనిని ఇంగ్లీష్‌లో బాటిల్ గార్డ్ అంటారు. మానవజాతికి ఏనాడో పరిచయమైన అతి ప్రాచీనమైన కూరగాయ సొరకాయ. ఎండిన సొరకాయపై తొడుగును సొరకాయ బుర్ర అని పిలుస్తారు. దీనిలో నీరు పోసుకుని పొలాలకు తీసుకుని రైతులు వెళుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. పూర్వకాలంలో పెద్దవారు సొరకాయలోని నీళ్ళు తాగబట్టే మనవాళ్ళు అన్ని సంవత్సరాల పాటు బతికేవారని చెబుతుంటారు . సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మన శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుంది.

అనేక వ్యాధుల‌కి నివార‌ణ‌గా..

శ‌ర‌రీరంలో విప‌రీత‌మైన వేడి ఉన్న‌వారు సొర‌కాయ ర‌సం తాగ‌డం మంచింది. సొరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేయ‌డ‌మే కాక మెద‌డులోని క‌ణాల‌ని ఉత్తేజితం చేస్తుంది. నువ్వుల నూనెతో సొరకాయ వేపుడు చేసుకుని తింటే నిద్ర సమస్యను అధిగమించవచ్చు అని ప‌లు అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. సొరకాయ సులభంగా జీర్ణం అవుతుంది. మలబద్థక, కాలేయ సమస్యను ఉన్నవారికి సొరకాయ తిన‌డం చాలా మంచిది. బాటిల్ గార్డ్ అనేక వ్యాధులకు నివారణ‌గా ప‌ని చేస్తుంది. సొరకాయ చాలా మందికి బోరింగ్ వెజిటేబుల్‌గా అనిపిస్తుంది. కానీ.. దీన్ని తినడం వల్ల బ‌హు ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

వేసవి కాలంలో సొరకాయ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఇది వేడిని ఎదుర్కోవడంలో శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. సొరకాయ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఔషధం మాదిరిగా ప‌ని చేస్తుంది. అంతేకాకుండా ఇది చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆనపకాయలో ఐరన్ చాలా మంచి మొత్తంలో ఉండ‌డం వ‌ల‌న ఇది శరీరంలో హిమోగ్లోబిన్ పెంచడానికి సాయ‌ప‌డుతుంది.లూజ్ మోషన్‌ లాంటి సమస్యతో బాధపడుతుంటే.. పెరుగు లేదా మజ్జిగతో సొర‌కాయ‌కాయ రైతా తింటే ఈ సమస్యను నియంత్రించవచ్చు. నీరసం కూడా త‌గ్గే అవ‌కాశం ఉంది.

Exit mobile version