Telugu Flash News

Prabhas – maruthi సినిమాలో boman irani కీలక పాత్రలో..

prabhas

Prabhas : పాన్-ఇండియా హీరో, రెబెల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రంలో బొమన్ ఇరానీ ఒక కీలక పాత్రను పోషించనున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ ప్రస్తుతం స్పెయిన్‌లో హాలిడేలో ఉన్నాడని మరియు ఈ వీకెండ్ లో అతను ఇండియాకు తిరిగి వస్తాడని సమాచారం.

ప్రభాస్ ఇండియా వచ్చాక ‘సాలార్’లో కొన్ని మిగిలిపోయిన సన్నివేశాలలో నటించనున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 2022 చివరి నాటికి పూర్తవుతుందని అంచనా.

‘సాలార్’తర్వాత ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో రూపొందనున్న హారర్ కామెడీ సినిమా లో బిజీగా ఉందనున్నాడు.మారుతి తన సినిమా షూట్‌లను చాలా త్వరగా పూర్తి చేస్తాడని తెలిసిందే.

హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన రిచ్ హౌస్ సెట్‌లో 70% చిత్రీకరణ జరగనుందని సమాచారం.

ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది మరియు బాలీవుడ్ సీనియర్ నటుడు బోమన్ ఇరానీ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో బోమన్ దెయ్యంగా కనిపించనున్నట్టు సమాచారం.


కెరీర్ తొలిదశలో హారర్ సినిమా చేసిన మారుతి గతంలో ‘ప్రేమ కథా చిత్రమ్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ఈ చిత్రంలో మాళవిక మోహనన్, రాశి ఖన్నా, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం.
డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం.

మరిన్ని ఆసక్తికరమైన వార్తలు చదవండి :

RRR : ఎమోషన్స్ ఎంత బలంగా ఉంటే సినిమాని అంత ఇష్టపడతారు : రాజమౌళి

sleeping tips : నిద్ర పట్టడం లేదా ? ఈ 9 చిట్కాలు మీకోసమే..

Weight loss :మీరు నాజూగ్గా కనబడాలనుకుంటున్నారా? ఇలా చేస్తే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు..

janhvi kapoor at apoorva mehta birthday bash

Exit mobile version