Telugu Flash News

టాలీవుడ్ పై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్లు ?

bollywood heroines

తెలుగు సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్ లు నటించడం కొత్తేమీ కాదు. అలనాటి నటీమణులు టాబు, సోనాలీ బెంద్రే , ఊర్మిళ , అమీషా పటేల్, కత్రినా కైఫ్  నుండి ఇప్పటి అలియా భట్ వరకు తెలుగు తెరపై మెరుస్తూనే ఉన్నారు.  అప్పట్లో కొందరు స్టార్ హీరోయిన్ లు తెలుగు లో నటించడం ఎక్కువగా ఇష్టపడేవారు కాదు. రెమ్యూనరేషన్ పరంగా కొందరైతే.. గుర్తింపు సరిగ్గా ఉండదని కొందరు ఒప్పుకోకపోయేవారు. అందుకే మన వాళ్ళు తెలుగు వారితో పాటు తమిళ , మలయాళ బ్యూటీ లను టాలీవుడ్ లో తీసుకునే వారు. ఇంకా బాలీవుడ్ మోడల్స్ కి కూడా మన సినిమా లలో చాలానే అవకాశాలు వచ్చాయి.

కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పాన్ ఇండియా మూవీస్ గా టాలీవుడ్ సినిమా లు రూపొందడం తో మరియు ఆ చిత్రాలు ఘన విజయం సాదించడం తో తెలుగు పరిశ్రమ పై బాలీవుడ్ భామల కన్ను పడింది. ఇప్పుడిప్పుడే సినిమా లెవెల్ పెంచుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు తిరగరాస్తున్న తెలుగు ఇండస్ట్రి వైపు అందరి దృష్టి మల్లుతుంది. ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాలు చూస్తే మీకు అర్దం అవుతుంది.

పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘లైగర్’ ఈ సినిమాతో తెలుగు తెరకి అనన్య పాండే కథానాయికగా పరిచయమవుతోంది. ఆగస్టు 25వ తేదీన ఈ చిత్రం విడుదలవుతోంది. ఆ తరువాత చేయనున్న ‘జన గణ మన’ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు పరిశ్రమ లో అడుగుపెడుతుందని సమాచారం.

ఇంకా .. ‘RRR’ లో సీత పాత్రలో నటించిన అలియా భట్ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఎన్టీఆర్ జోడీగా కొరటాల సినిమా చేయడానికి ఒప్పుకుంది . ఇక తెలుగులో రెండు సినిమాలు చేసిన కియారా అద్వానీ మరోసారి రామ్ చరణ్ సరసన చేయడానికి అంగీకరించింది.

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో వరుణ్ తేజ్ హీరోగా చేసిన ‘గని’ సినిమాలో ఆయన సరసన బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ సిద్ధమవుతోంది. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది . అఖిల్ ‘ఏజెంట్’ సినిమా ద్వారా సాక్షి వైద్య పరిచయమవుతుంది . రవితేజ రీసెంట్ గా రాబోతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం ద్వారా పరిచయమవుతున్న కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ కూడా బాలీవుడ్ భామనే.

ఇక రెబెల్ స్టార్ ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్న ‘ప్రాజెక్టు K’లో ఆయన సరసన దీపికా పదుకొనే చేయడం విశేషం గా చెప్పుకోవచ్చు. బాలీవుడ్ తారలు ఇప్పుడు తెలుగు లో చేయడాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు చదవండి :

పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌..

ప్రత్యేకంగా హిందీ సినిమా చేయనవసరం లేదు : మహేష్ బాబు

Exit mobile version