Deepveer: ఇటీవల చాలామంది సెలబ్రిటీల జీవితాల్లో విడాకులు కామన్ అయిపోయింది. సమంత- నాగ చైతన్య జంట, ఆ తర్వాత ధనుష్ జంటతో పాటు పలువురు ప్రముఖులు విడాకులు తీసుకున్నారు. ఇక మెగా విడాకుల విషయాలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక చాలా కాలంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. కొన్నాళ్లుగా వీరి విడాకుల విషయంపై ప్రచారాలు జరుగుతున్నా తాజాగా ఈ వీడియో చూపిస్తూ వారిరివురు విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు.
మరోసారి ముందుకు వెళ్లిన రణ్వీర్, దీపిక వైపు చూశాడు. కానీ.. దీపిక మాత్రం అతన్ని పట్టించుకోకుండా ముందుకు పోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వారిద్దరూ గతేడాది విడిపోయి, వేరు వేరుగా నివసిస్తున్నా పబ్లిక్ ఈవెంట్స్ కోసం కలిసి వస్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు. ఈ వార్తలపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.