HomecinemaDeepveer: ఆ బాలీవుడ్ జంట విడాకులకి సిద్ధ‌మైందా.. ఆందోళ‌న చెందుతున్న ఫ్యాన్స్

Deepveer: ఆ బాలీవుడ్ జంట విడాకులకి సిద్ధ‌మైందా.. ఆందోళ‌న చెందుతున్న ఫ్యాన్స్

Telugu Flash News

Deepveer: ఇటీవల చాలామంది సెలబ్రిటీల జీవితాల్లో విడాకులు కామ‌న్ అయిపోయింది. స‌మంత‌- నాగ చైత‌న్య జంట‌, ఆ త‌ర్వాత ధ‌నుష్ జంట‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు విడాకులు తీసుకున్నారు. ఇక మెగా విడాకుల విష‌యాలు కూడా తెగ వైర‌ల్ అవుతున్నాయి.

ఇక చాలా కాలంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తుంది. కొన్నాళ్లుగా వీరి విడాకుల విష‌యంపై ప్ర‌చారాలు జ‌రుగుతున్నా తాజాగా ఈ వీడియో చూపిస్తూ వారిరివురు విడాకులు తీసుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని చెబుతున్నారు.

ranveer singh and deepika padukone divorceదీపిక, రణవీర్ కలిసి ఇటీవల ముంబైలో జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ అవార్డ్స్ వేడుక‌కి హాజరయ్యారు. ఈ వేడుక కోసం దీపిక, రణ్‌వీర్ కలిసి కారులో వచ్చారు. రెడ్ కార్పెట్‌పై నడుస్తూ.. దీపిక చేయి పట్టుకోడానికి రణ్‌వీర్ చేయి ఇచ్చాడు. కానీ.. దీపికా మాత్రం తనని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయింది.

మరోసారి ముందుకు వెళ్లిన రణ్‌వీర్, దీపిక వైపు చూశాడు. కానీ.. దీపిక మాత్రం అతన్ని పట్టించుకోకుండా ముందుకు పోవ‌డంతో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. వారిద్దరూ గతేడాది విడిపోయి, వేరు వేరుగా నివసిస్తున్నా ప‌బ్లిక్ ఈవెంట్స్ కోసం క‌లిసి వ‌స్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు. ఈ వార్త‌ల‌పై క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News