HomecinemaBox Office Collections : బాలీవుడ్ లోనూ తగ్గేదే లే అంటున్న ‘కాంతారా’

Box Office Collections : బాలీవుడ్ లోనూ తగ్గేదే లే అంటున్న ‘కాంతారా’

Telugu Flash News

‘కాంతారా’ హిందీ వెర్షన్ కు థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఈమధ్య హిందీ బాక్స్ ఆఫీస్ (Box Office Collections) దగ్గర దక్షిణాది సినిమాల హవా ఎక్కువ కనపడుతుంది. గత సంవత్సరం పుష్ప నుండి ఇప్పటి ‘కాంతారా’ వరకు కలెక్షన్ల జోరు చూస్తే అర్ధమవుతుంది. వచ్చే దీపావళి పండగను దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

అయితే ఈ మధ్య దక్షిణాది సినిమాలు హిందీ సినిమాలను దాటి థియేటర్లలో తమ జోరు కొనసాగిస్తుండడం చూస్తే ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకు ఎంత ప్రాధ్యానతను ఇస్తారో తెలుస్తుంది. అయితే ‘కాంతారా’ తో పాటు మరికొన్ని సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

బాక్స్ ఆఫీస్ కలెక్షన్ (Box Office Collections) రిపోర్ట్ ప్రకారం

kantara movie box office collections
kantara movie box office collections

కాంతారా’ లాంటి తక్కువ బడ్జెట్ సినిమా విజయవంతంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ సినిమాకు బుధవారం ఒక్కరోజే 7 కోట్లు కలెక్షన్ వచ్చింది. మొత్తంగా ఈ సినిమా 133.75కోట్లు కలెక్షన్ ను రాబట్టింది.

DoctorG movie box office collections
DoctorG movie box office collections

ఆయుష్మ్యాన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘డాక్టర్ జి’ కూడా మంచి టాక్ తో మోస్తరు కలెక్షన్ల ను రాబడుతుంది. ఓపెనింగ్ వసూళ్లు కొంచెం నిరాశపరిచినా మంచి టాక్ రావడంతో కలెక్షన్ జోరు పెరిగింది. పండగ సీజన్ లో మరింతగా బిజినెస్ జరిగే అవకాశం ఉందని థియేటర్ యజమానులు ఆశాభావం వ్యక్తపరిచారు.

god father movie box office collections
god father movie box office collections

చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ బుధవారం కలెక్షన్ 40 లక్షలతో మొత్తం 72.41 కోట్లు వసూళ్లు రాబట్టింది.

మణిరత్నం నిర్మించిన ‘పొన్నియన్ సెల్వన్-1’ సినిమా కలెక్షన్ల జోరు తగ్గి 252.82 కోట్ల వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం.

-Advertisement-

హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన ‘విక్రమ్ వేధా’ కలెక్షన్లు మొదటి రోజు నుండి నిరాశ పరిచాయి. ఇది తమిళ సినిమా రీమేక్ కావడం ఇదివరకే చాలామంది ఆ సినిమాను చూసేయడంతో ఆశించినంత ఫలితం ఈ సినిమాకు రాలేదు. ఈ సినిమాకు బుధవారం కలెక్షన్ 35 లక్షలతో కలిపి మొత్తం 77.66 కోట్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి :

భారీ బడ్జెట్ మూవీ మేకర్స్ కి హార్ట్ ఎటాక్ వస్తుందేమో..కాంతారా సినిమాను పొగుడుతూ RGV వ్యాఖ్యలు

‘కాంతారా’ (kantara) లో ఉన్న గ్రామ పెద్ద ఇల్లు ఎక్కడుందో తెలుసా..మీరు కూడా ఆ ఇంటిలో ఉండచ్చు..

ఈ శాండిల్ వుడ్ RRR గురించి తెలుసుకోవాల్సిందే!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News