Telugu Flash News

Black Pepper: మిరియాల‌ని ఎక్కువ‌గా వాడుతున్నారా, వాటి ప్ర‌యోజ‌నాల గురించి మీకు తెలుసా?

Black Pepper: ప్ర‌తి ఇంట్లో మిరియాలు త‌ప్ప‌క ఉంటాయి. పెద్ద‌వాళ్లు మ‌న‌కు జ‌లుబు చేస్తే వెంట‌నే మిరియాల చారు చేసి ఇస్తారు. దీంతో రెండు రోజుల‌లో జ‌లుబు ప‌రార్ అంటుంది. సుగంధ ద్రవ్యాల్లో మిరియాల‌ని రారాజుగా చెబుతుంటారు. నల్ల మిరియాల్లో పెప్పరైన్, కాప్సేసిన్ అనే రసాయనాలు ఉండ‌డం వ‌ల‌న మిరియాలకు ఘాటైన వాసన ఉంటుంది. ఈ పెప్పరైన్ శ్వాసను నియంత్రించి మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉండ‌డం వల‌న వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

బ‌హు ప్ర‌యోజ‌నాలు..

మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండ‌డం వ‌ల‌న రోగాలని మ‌న చెంత‌కు ద‌రి చేర‌నివ్వ‌దు. 15 మిరియపు గింజలు, రెండు లవంగాలు, ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని వాటిని దంచి వేణ్నీళ్లలో కాచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉంటే ఆయాసం, గొంతునొప్పి తగ్గుతుంది. నాలుగు మిరియాలని కచ్చాపచ్చాగా దంచి తేనెతో కలిపి తమలపాకులో పెట్టి తీసుకుంటే జ్వ‌ర తీవ్ర‌త కూడా త‌గ్గుతుంద‌ట‌. కాలేయాన్ని శుద్ధిచేసి దాని పనితీరును మెరుగుపర‌చ‌డంలో మిరియాల ప్ర‌ముఖ పాత్ర పోష‌ఙ‌స్తాయి. మిరియాల టీ ఫ్యాటీలివర్‌ని అదుపులో ఉంచ‌డంతో పాటు జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తాయి.

మిరియాలు జీర్ణక్రియను వేగవంతం చేయ‌డంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. పాలల్లో మిరియాలపొడి, పసుపు, శొంఠి వేసుకుని నిద్రపోయే ముందు తాగితే ఊపిరితిత్తుల సమస్యలు మీ ద‌రి చేర‌వు. అయితే కడుపులో మంట ఉన్నవారు మాత్రం మిరియాలి మితంగా తీసుకోవడం మంచిది. ఇక చిన్న పిల్లలకు శీతాకాలంలో ఎక్కువగా దగ్గు, జబులు వస్తూ ఉంటాయి కాబ‌ట్టి ఆ స‌మ‌యంలో మందులు వాడ‌కుండా మిరియాల పాలు లేదా మిరియాల రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకుంటే కండరాలు, నరాల నొప్పి నుంచి కూడా ఉపశ‌మ‌నం పొందుతారు.

Exit mobile version