Black Pepper Benefits: మిరియాలు రుచికే కాదు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి అనే విషయం తెలిసిందే. చాలా మంది మిరియాలని విరివిగా ఉపయోగిస్తుంటారు. మిరియాల వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖ్యంగా నల్ల మిరియాలను ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో తీసుకుంటే, అది మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నల్లటి మిరియాలను గోరువెచ్చని నీళ్లతో తీసుకుంటే స్టామినా పెరుగుతుంది.
కడుపులో గ్యాస్ లేదా అసిడిటీ ఉంటే నిమ్మరసంలో చిటికెడు బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది.
ఇన్ని ప్రయోజనాలా…
బ్లాక్ పెప్పెర్ లో పైపెరిన్ ఉండడం వలన ఒత్తిడి, నిరాశను తొలగించడంలో సహాయపడతాయి. నల్ల మిరియాలు చిగుళ్ల నొప్పికి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.
ఎండుమిర్చి, జాజికాయ, రాళ్ల ఉప్పు ఈ మూడింటినీ సమపాళ్లలో కలిపి పౌడర్‌లా చేసి కొన్ని చుక్కల ఆవాల నూనె కలిపి దంతాలకు, చిగుళ్లకు పట్టించి అరగంట తర్వాత నోటిని శుభ్రం చేసుకుంటే మీ దంతాలకు సంబంధించిన సమస్యలు అన్నీ దూరం అవుతాయి.
ఇక నల్ల మిరియాల వలన మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్లు, కెరోటిన్లు మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లను ఉండడం వలన రొమ్ము క్యాన్సర్ ను నివారిస్తుంది.
బ్లాక్ పెప్పరు వేడిపాలలో కలిపి తాగితే జలుబు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువుతో బాధపడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారు రోజూ తినే ఆహారంలో నల్ల మిరియాల పొడిని తీసుకుంటే మేలు కలుగుతుంది.
మిరియాల పొడిని టీలో కూడా కలుపుకొని తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.మిరియాల చారు అయితే ఎంతో రుచికరంగా ఉండడంతో పాటు మనకు ఎన్నో సమస్యలని దూరం చేస్తుంది.