Telugu Flash News

Bill Gates : లేటు వయసులో ఘాటు ప్రేమ.. లవ్‌లో పడిన బిల్‌ గేట్స్‌!

bill gates in love with paula hurd

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా పేరు గాంచిన బిల్‌ గేట్స్‌ (Bill Gates) నిరంతరం వార్తల్లో ఉంటుంటారు. ప్రస్తుతం సరికొత్త అంశంలో ఆయన వార్తల్లో నిలిచారు. లేటు వయసులో బిల్‌ గేట్స్‌ ప్రేమలో పడ్డారన్న వార్త ఇప్పుడు హల్‌ చల్‌ చేస్తోంది. రెండేళ్ల కిందటే మెలిందాతో విడాకులు తీసుకున్న బిల్‌ గేట్స్‌.. ఇప్పుడు కొత్తగా డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏడాది కాలంగా ఆయన ఒరాకిల్‌ దివంగత సీఈవో భార్య పాలా హర్డ్‌తో ప్రేమలో ఉన్నాడట.

సంవత్సర కాలంగా ఆమెతో బిల్‌ గేట్స్‌ డేటింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు పదుల వయసు దాటిన ఈ జంట.. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని మీడియాకంట పడ్డారు. అనంతరం వీరి డేటింగ్‌, ప్రేమ వ్యవహారాలపై వార్తలు మొదలయ్యాయి. కొంత కాలంగా వీరిద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని వీరిద్దరి స్నేహితులు కూడా ధ్రువీకరించడం గమనార్హం. దీంతో పాలా హర్డ్‌తో బిల్‌ గేట్స్‌ డేటింగ్‌ నిజమనే నిర్ధారణకు వస్తున్నారు.

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడిగా, ప్రపంచ కుబేరుడిగా పేరుగాంచిన బిల్‌ గేట్స్‌ వయసు ఇప్పుడు 67 ఏళ్లు. 2021లోనే ఆయన భార్య మెలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌తో విడిపోయాడు. అనంతరం విడాకులు తీసుకున్నారు. ఇక తాజాగా ప్రేమలో పడ్డ పాలాహర్డ్‌ వయసు 60 ఏళ్లు. ఈమె భర్త ఒరాకిల్‌ సీఈవోగా పని చేసిన మార్క్‌ హర్డ్‌. 2019 అక్టోబర్‌లో క్యాన్సర్‌తో పోరాడుతూ ఆయన చనిపోయారు. పాలాహర్డ్‌కు ఇద్దరు కుమార్తెలు సంతానం.

ఏడాది కాలంగా బిల్‌గేట్స్‌, పాలాహర్డ్‌ డేటింగ్‌ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ జరిగింది. ఫైనల్‌లో పాలా హర్డ్‌, బిల్‌ గేట్స్‌ పక్కపక్కనే కూర్చొని వీక్షించినట్లు ఫొటోలు వైరల్‌ అయ్యాయి. వీరి సాన్నిహిత్యంపై స్నేహితులు స్పందించారు. వారిద్దరి బంధం విడదీయరానిది అంటూ అంతర్జాతీయ మీడియాతో పేర్కొనడంతో బిల్‌గేట్స్‌ ప్రేమపై స్పష్టత ఇచ్చినట్లయింది. 1987లో మైక్రోసాఫ్ట్‌లో బిల్‌గేట్స్‌, మెలిందాల పరిచయం ప్రేమకు దారి తీసి అనంతరం పెళ్లి చేసుకున్నారు.

also read :

Overseas Education: ఇండియన్‌ స్టూడెంట్స్‌ డెస్టినేషన్‌.. యూఎస్‌, కెనడా, బ్రిటన్‌!

Chiranjeevi: త‌న‌పై కోడిగుడ్లు విసిరారని చెప్పిన చిరంజీవి.. అవాక్క‌వుతున్న అభిమానులు

Exit mobile version