Telugu Flash News

Bihar News: బిహార్‌లో కల్లోలం.. 71కి చేరిన కల్తీ సారా మృతులు.. నితీష్‌ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ తాఖీదులు!

Bihar News: బిహార్‌లో కల్తీ సారా కల్లోలం సృష్టిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 28 మంది ఇప్పటి వరకు కల్తీ మద్యం కారణంగా మృత్యువాత పడ్డారు. అయితే, అనధికారికంగా ఈ మరణాల సంఖ్య 71కి చేరినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారంటూ కొంత కాలంగా అక్కడి ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని, అసెంబ్లీలోనూ, బయట కూడా ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సాక్షిగా సీఎం నితీష్ కుమార్‌ ఊగిపోయారు. కల్తీ సారా మరణాలపై చర్చ సందర్భంగా సహనం కోల్పోయిన సీఎం నితీష్‌.. మునుపెన్నడూ లేని విధంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చేది లేదని స్పష్టీకరించారు సీఎం నితీష్‌.

ఈ క్రమంలో కల్తీ మద్యం మరణాలపై మీడియాలో వచ్చిన కథనాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC) స్పందించింది. నితీష్‌ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది.

కల్తీ మద్యం మరణాలపై రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు బాస్‌ డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు ఇచ్చింది. ఈ అంశంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య, మరణించిన కుటుంబాలకు ఇచ్చే పరిహారం లాంటి పలు అంశాలపై వివరణాత్మకంగా తమకు నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సూచించింది. అంతేకాదు.. ఈ ఘటనకు కారకులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని స్పష్టం చేసింది.

అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై దాడులు

ఈ నేపథ్యంలో బిహార్‌ ప్రభుత్వం కల్తీ మద్యం, తదనంతర పరిణామాలపై దర్యాప్తు చేపట్టింది. అదనపు ఎస్పీ నేతృత్వంలోని ముగ్గురు పోలీసు అధికారులతో పాటు మరో 31 మందితో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు సారణ్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై పోలీసులు విస్తృతంగా దాడులు జరుపుతున్నారు.

also read news:

Katrina kaif latest hot photo gallery 2022

Rishi sunak : భారతీయుడైన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గురించి తెలుసుకోండి..

Exit mobile version