Bigg Boss Telugu 6: బిగ్ బాస్ గేమ్ ఇప్పుడు రంజుగా మారుతుంది. ఇప్పుడిప్పుడే గేమ్ రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్ మధ్య పోటీ పెరుగుతుంది. కొద్ది రోజులుగా కెప్టెన్సీ టాస్క్ జరుగుతుండగా, `ఆఖరి వరకు ఆగని పరుగు` పేరుతోబిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో లోపల ఏర్పాటు చేసిన గదిలో పోటీలో ఉన్న వారి ఫోటోలతో పూల కుండీలుంటాయి.ఈ టాస్క్‌లో కంటెండర్స్ చేయాల్సింది ఏంటంటే.. వారి బొమ్మలతో ఉన్న కుండీలను కాకుండా వేరే వారివి తీసుకురావల్సి ఉంటుంది. చివరగా వచ్చినవారు, వారు తెచ్చిన పూల కుండీపై ఎవరిదైతే ఫోటో ఉంటుందో వాళ్లలో ఒకరు మళ్లీ పోటీలో పాల్గొనే అవకాశం దక్కుతుంది. మిగిలిన వారు తప్పుకోవల్సి ఉంటుంది.
కొత్త కెప్టెన్..
ఇందులో ఎవరు ఉండాలి, ఎవరు తప్పుకోవాలి అనేది మిగతా సభ్యుల చేతిలో ఉంటుంది. దీనికి ఫైమా సంచాలకురాలిగా వ్యవహరిస్తారు. అయితే టాస్క్‌లో సూర్య, ఆదిరెడ్డి, శ్రీ సత్య, రోహిత్, వసంతి, రేవంత్, అర్జున్ పాల్గొన్నారు. మొదట వసంతి, ఆ తర్వాత ఆదిరెడ్డి, తర్వాత రేవంత్, అలాగే అర్జున్, శ్రీ సత్య ఒక్కో సారి ఒక్కొకళ్లు పోటీ నుండి తప్పుకున్నారు. ఇక గేమ్ చివరకి వచ్చే సరికి సూర్యకి, రోహిత్‌కి మధ్య పోటీ నెలకొంది. అయితే చివరి వరకు తన భర్తకి సపోర్ట్ చేస్తూ వచ్చిన మెరీనా కెప్టెన్సీ కంటెండర్ ఫైనల్‌లో మాత్రం ఆయనకు హ్యాండివ్వడంతో ఎక్కువ ఓట్లు వచ్చిన సూర్య కెప్టెన్ అయ్యాడు. అయితే ఈ టాస్క్‌లో ఇనయ వరుసలు కలపడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఎవరికి ఓటు వేయాలి బావకా(సూర్య), బ్రదర్‌కా(రోహిత్) అంటూ చెప్పడంతో అంతా హో ఏసుకున్నారు. ఇక ఆమె సూర్యకే ఓటు వేసింది. మొత్తానికి ఏడో వారానికి సంబంధించిన బిగ్ బాస్ హౌజ్‌కి సూర్య కెప్టెన్ అయ్యారు. ఇక సపోర్ట్ చేసే విషయంలో ఇనయకి, ఫైమాకి మధ్య డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ పెరగడంతో నీ సపోర్ట్ వద్దు నీవొద్దు అంటూ ఫైమా పెద్ద మాటలు అనేసింది. మరోవైపు కెప్టెన్సీ టాస్క్ లో పోరాడే టైమ్‌లో ఆదిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయి. గతంలో తాను కెప్టెన్సీ చేసి ఫెయిల్ అయ్యానని, తానేమీ పీకలేదని నాగార్జున సర్ అన్నారని, ఈ సారి ఛాన్స్ వస్తే పీకుదామనుకుంటున్నా అని ఆయన అనడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ వారంలో బాలాదిత్య, ఆదిరెడ్డి, గీతూ, సుదీప, శ్రీహాన్, శ్రీసత్య, మెరీనా, కీర్తి, రాజశేఖర్ నామినేషన్‌లో ఉండగా, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.