Homebigg boss telugu season 6Bigg Boss6: రెచ్చిపోతున్న శ్రీహాన్.. ముద్దుల మావయ్య‌లో ఇంత మార్పా?

Bigg Boss6: రెచ్చిపోతున్న శ్రీహాన్.. ముద్దుల మావయ్య‌లో ఇంత మార్పా?

Telugu Flash News

Bigg Boss6: బిగ్ బాస్ సీజ‌న్ 6 స‌క్సెస్ ఫుల్‌గా 13వారాలు పూర్తి చేసుకుంది. హౌజ్‌లో ప్ర‌స్తుతం ఏడుగురు స‌భ్యులు మాత్ర‌మే ఉన్నారు. వీరిలో శ్రీహాన్ ఇప్ప‌టికే ఫైన‌ల్ కి చేరుకోగా, మిగ‌తా వారు ఆ స్థానాన్ని ద‌క్కించుకునేందుకు తెగ కృషి చేస్తున్నారు. అయితే సోమవారం నుంచి కంటెస్టెంట్లకి విచిత్రమైన టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్‌బాస్‌. మరోవైపు గ్యాప్‌ దొరికితే ఒకరిపై ఒకరు ఆరోపలు, కామెట్లు చేస్తూ కంటెస్టెంట్లు రచ్చ చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు . ఏడు స్థానాల్లో ఎవరు ఏ స్థానానికి అర్హులో ర్యాకింగ్‌తో చెప్పాలని తెలిపారు.

రేవంత్ త‌న‌కు తాను మొదటి స్థానం ఇచ్చుకోగా, ఇనయ రెండో స్థానం, కీర్తి మూడు, శ్రీ సత్య 4, శ్రీహాన్‌ ఐదు, ఆదిరెడ్డి 6, రోహిత్‌ ఏడో స్థానాల్లో నిలుచుకున్నారు. అందరి ఏకాభిప్రాయం ప్రకారం రేవంత్‌ మొదటి స్థానం, శ్రీహాన్‌ రెండో స్థానం, ఆదిరెడ్డి మూడు, ఇనయ నాలుగు, శ్రీ సత్య ఐదు, రోహిత్‌ ఆరు, కీర్తికి ఏడు స్థానం ఇచ్చారు. ఇక ఈ షోకి అన్‌ డిజర్వ్ కి ఎవరనేది ఫైనల్‌కి చేరిన శ్రీహాన్‌ చెప్పాలని బిగ్‌ బాస్‌ ఆదేశించడంతో ఆయన రోహిత్ పేరు చెప్పాడు. మరోవైపు ఇంటి సభ్యుల మధ్య గుసగుసలు ఎక్కువ అయ్యాయి. బాత్‌ రూమ్‌ విషయంలో తన వాదన తప్పు అని బాధ‌ప‌డ్డ శ్రీహాన్… కీర్తి తనని విమర్శించడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశాడు.

మరోవైపు శ్రీహాన్‌,శ్రీ సత్యల మధ్య కూడా గొడవ బాగానే జరిగింది. శ్రీహాన్‌ మారిపోయాడని, అప్పుడు ఒకలా ఉన్నాడని, ఇప్పుడు మరోలా బిహేవ్‌ చేస్తున్నాడని, మ‌నుషులు ఎప్పుడు ఒకలా ఉండరని శ్రీస‌త్య తెలిపింది. ఇక శ్రీహాన్‌ ఓ సీక్రెట్‌ బయట పెట్టాడు. ఇకపై తాను `ముద్దుల మామయ్య`గా మారిపోయానని , తను వేసే ప్రతి షర్ట్ పై సిరి ముద్దు ఉంటుందన్నారు. అది విన్న రేవంత్‌ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం గమనార్హం. గతంలోని గేమ్‌లో బిగ్‌ బాస్‌ 6 తెలుగు విన్నర్‌ ప్రైజ్‌ మనీ కొంత అమౌంట్‌ లాస్‌ అయిన విషయంతెలిసిందే. ఇందులో లక్ష వరకు మనీ పొందే అవకాశం ఇవ్వ‌గా, ఇందుకోసం శ్రీ సత్య, రోహిత్‌ టాస్క్ లో పాల్గొన్నారు. దీనిపై ఓటింగ్‌ పెడితే అందరు సభ్యులు రోహిత్‌ గెలుస్తారనుకున్నారు. కానీ సత్య గెలవడంతో ఆ అమౌంట్‌ గెలుచుకోవడంలో ఇంటి సభ్యులు విఫలం అయ్యారు. ఇక వారం నామినేష‌న్‌లో రేవంత్‌, ఇనయ, ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి, రోహిత్‌ డైరెక్ట్ గా మినేట్‌ అయ్యారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News