Homebigg boss telugu season 6Bigg Boss 6 : నామినేష‌న్స్‌తో హీటెక్కిన బిగ్ బాస్ హౌజ్‌..ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ?

Bigg Boss 6 : నామినేష‌న్స్‌తో హీటెక్కిన బిగ్ బాస్ హౌజ్‌..ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ?

Telugu Flash News

Bigg Boss 6 : బిగ్ బాస్ హౌజ్‌లో నామినేష‌న్స్ ఎంత ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌రిపై ఒక‌రు అవాకులు చెవాకులు పేల్చుకుంటూ ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోయేలా చేస్తుంటారు. ఇన్నాళ్లు నామినేష‌న్స్ చాలా రంజుగానే సాగిన ప‌ద‌కొండో వారం మాత్రం అంత ర‌స‌ప‌ట్టుగా సాగిన‌ట్టు అనిపించ‌లేదు. నామినేషన్లు మొక్కుబడిగా వేసినట్టుగా అనిపించింది. ప్ర‌స్తుతం హౌజ్‌లో పది మంది ఉన్నారు. రేవంత్‌, శ్రీహాన్‌, శ్రీ సత్య, ఇనయ, ఫైమా,రోహిత్‌, మేరినా, రాజ్‌, ఆదిరెడ్డి, కీర్తి ఉండ‌గా, వీరిలో ఎవ‌రు టాప్ 5లో ఉంటారు, ఎవ‌రు విన్న‌ర్ అవుతార‌నే ఆస‌క్తి అందరిలో ఉంది.

ఇక ఈ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ చూస్తే.. ఫైమా.. రోహిత్‌, ఇనయలాను నామినేట్ చేస్తూ.. ఇనయ మొదట టఫ్‌ ఇచ్చిందని, ఇప్పుడు తగ్గిందని, ఊరికే కోపానికి గురవుతుందంటూ కొంత చీవాట్లు పెట్టింది. ఇక ఆదిరెడ్డి.. శ్రీహాన్‌, రోహిత్‌లను నామినేట్ చేయ‌గా, పాము గేమ్‌లో మాట్లాడిన చోట మాట్లాడలేదని, అవసరం లేనిచోట మాట్లాడావని చెబుతూ రోహిత్‌ని నామినేట్‌ చేశాడు ఆదిరెడ్డి. ఇనయ.. ఆదిరెడ్డి, రాజ్‌లను నామినేట్ చేయ‌గా ఈ అమ్మ‌డి నామినేష‌న్ స‌మ‌యంలో ఆదిరెడ్డి, రాజ్ ఆమెతో గ‌ట్టిగానే వాదించారు. ఇక శ్రీహాన్‌ .. రోహిత్‌, కీర్తిలను నామినేట్‌ చేశాడు. రోహిత్‌ని తన్నిన సంఘటను గుర్తు చేస్తూ, కీర్తిని కెప్టెన్సీ టాస్క్ లో అంతా సపోర్ట్ చేస్తుంటే చివర్లో తప్పుకుని డిజప్పాయింట్‌ చేశావంటూ వారిని నామినేట్ చేశాడు శ్రీహాన్.

మెరినా.. రేవంత్‌, ఇనయలను నామినేట్ చేయ‌గా, సంచాలక్‌ గా సరిగా చెప్పలేదని రేవంత్‌ని, గేమ్ స‌రిగ్గా ఆడ‌డం లేద‌ని ఇనయని నామినేట్‌ చేసింది. రాజ్‌.. మెరినా, ఇనయాలను నామినేట్ చేయ‌గా, కంటెండర్‌టాస్క్ లో సరిగా ఆడలేదని మెరినానీ, అలాగే తనపై నామినేట్‌ చేసిన ఇనయకి వివరణ ఇస్తూ ఇన‌య‌ని నామినేట్‌ చేశాడు రాజ్‌. శ్రీసత్య.. ఇనయ, కీర్తిలను నామినేట్ చేయ‌గా, ఇక రోహిత్‌.. రేవంత్‌, ఆదిరెడ్డిలను నామినేట్‌ చేశాడు. అనంతరం కీర్తి.. శ్రీ సత్య, మెరినాలను, రేవంత్‌.. రోహిత్‌, మెరినాలను నామినేట్ చేశాడు. ఇలా ప‌దకొండో వారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేషన్ల ప్రక్రియలో ఇనయ, రోహిత్‌, మెరినా, ఆదిరెడ్డి, కీర్తి, రేవంత్‌, శ్రీ సత్య, శ్రీహాన్‌, రాజ్ ఉన్నారు. వీరిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

also read news:

Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణ ఇక‌లేరు.. శోక సంద్రంలో అభిమానులు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News