Telugu Flash News

Bigg Boss 6: ఈ వారం నామినేష‌న్స్.. టార్గెట్ ఇన‌య‌.. ఇంకా ఎవ‌రెవ‌రు నామినేట్ అయ్యారంటే..!

bigg boss telugu season 6

Bigg Boss 6: బిగ్ బాస్ హౌజ్‌లో ఆదివారం ఎలిమినేషన్స్, సోమవారం నామినేష‌న్స్ ప్ర‌క్రియ‌, మంగ‌ళ‌వారం కెప్టెన్సీ టాస్క్ .. ఇలా వ‌రుస రోజుల‌లో హౌజ్ మేట్స్ త‌మ విశ్వ‌రూపం చూపించి నానా ర‌చ్చ చేస్తుంటారు. తొమ్మిదో వారంలో గీతూ ఎలిమినేట్ కావ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన విష‌యం తెల‌సిందే. తాను ఎలిమినేట్ అయినందుకు గీతూ బోరుబోర‌ను విల‌పించింది. అంతేకాదు కంటెస్టెంట్స్ కి కూడా క‌న్నీళ్లు పెట్టించింది. ఇక 64వ ఎపిసోడ్‌లో ప‌దో వారం నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌రిగింది.ఈ క్ర‌మంలో హౌజ్‌మేట్స్ ఒకరిపై ఒకరు చేసుకునే ఆరోపణలు పీక్‌లోకి వెళ్లాయి. విమర్శలు కొన్ని సందర్బాల్లో కట్టలు తెంచుకోవ‌డంతో పాటు పర్సనల్‌గానూ విమర్శించేంత వ‌ర‌కు వెళ్లాయి.

పీక్స్‌లో నామినేష‌న్స్..

ఎప్ప‌టి మాదిరిగానే ఈ సారి కూడా ఇన‌య‌ని చాలా మంది టార్గెట్ చేశారు. మొత్తంగా ఎనిమిది నామినేష‌న్స్ వ‌చ్చాయి. మొదట శ్రీసత్య ఆమెని నామినేట్‌ చేయగా, ఆ సమయంలో ఇరువురు ఘాటుగా విమర్శలు చేసుకున్నారు. ఆ తర్వాత ఆదిరెడ్డి సైతం ఇనయని నామినేట్ చేయ‌గా, వాసంతి సైతం ఇనయని నామినేట్ చేయ‌డం విశేషం. ఇక కీర్తి, బాలాదిత్య, మెరీనా, రాజ్‌, శ్రీహాన్‌లు కూడా ఇనయని నామినేట్‌ చేశారు. ఆదిరెడ్డికి ఇనయకి, శ్రీహాన్‌కి ఇనయకి, ఫైమాకి ఇనయకి గొడవ అయితే బిగ్ బాస్ హౌజ్ ద‌ద్ద‌రిల్లే మాదిరిగా జ‌రిగింది.

ఇనయ ఫేక్‌ అని, డబుల్‌ ఫేస్‌ అని ఫైమా విమర్శించ‌డంతో, నీ కామెడీ నాకు నచ్చదని ఇనయ సైతం ఫైమాపై రెచ్చిపోయి అర‌చేసింది.. మరోవైపు శ్రీహాన్‌ అపరిచితుడంటూ కీర్తి విమర్శించ‌గా, హ్యూమానిటీ లేదని ఇనయ శ్రీహాన్‌పై నిప్పులు చెరిగింది.అలాగే రేవంత్‌, ఆదిరెడ్డి లు కూడా నువ్వా నేనా అనేట్టుగా మాట‌ల తూటాలు విసురుకున్నారు. నేను ఇలానే ఉంటానని రేవంత్‌, నేను తగ్గేదెలే అని ఆదిరెడ్డి ఒక‌రికొక‌రు సవాల్‌ విసురుకున్నారు. దీంతో హౌజ్ ఫుల్‌ హీటెక్కింది. ఇక పదో వారానికి సంబంధించి బాలాదిత్య, మెరీనా, కీర్తి, ఫైమా, వాసంతి, ఆదిరెడ్డి, శ్రీహాన్‌, ఇనయ నామినేట్‌ అయ్యారు. వీరిలో ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారా అనే ఆస‌క్తి అందరిలో ఉంది.

also read :

చంద్ర గ్రహణం గర్భిణిలపై ప్రభావం చూపుతుందా ? నిజమెంత ?

horoscope : 8-11-2022 మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే ?

Exit mobile version