Bigg Boss 6 : బిగ్ బాస్ సీజన్ 6లో తాజా ఎపిసోడ్స్ చాలా ఎమోషనల్‌గా సాగుతున్నాయి. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స రీచార్జ్ చేసుకునేటాస్క్ ఇవ్వగా, ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇచ్చిన మూడు ఆప్షన్స్ లో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఈ క్రమంలో శ్రీహాన్, ఆది రెడ్డి ముందు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగా, ఆ తర్వాత గీతూ, అర్జున్, ఇనయ, బాలాదిత్యలకు అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో గీతూ తన తండ్రితో ఆడియో కాల్ మాట్లాడే ఆప్షన్ తీసుకుంది. తనదైన స్టయిల్లో డాడీతో మాట్లాడి అలరించింది.
కన్నీటి ధార..
ఇక శ్రీ సత్య తన చార్జ్ కాస్త తగ్గించుకొని తన తండ్రితో కేవలం వీడియో సందేశం పొందే అవకాశం అందుకుంది. ఇక తన తండ్రి వీడియోని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు శ్రీ సత్ . కీర్తి కూడా భావోద్వేగానికి గురి కాగా, సూర్య అయితే ఏడ్చేస్బి గ్ బాస్, నన్ను పంపించేయండి అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. సూర్యని ఇనయ ఓదార్చింది. ఇక ఇనయ వంతు రాగా, ఆమె కొంత సాక్రిఫైజ్ చేసి అమ్మా నాన్న ఉన్న ఫోటోని కోరగా, బిగ్ బాస్ ఆ ఫొటోని పంపాడు. ఇనయ ఆ ఫొటో చూసి చాలా ఎమోషనల్ అయింది. ఇక రీచార్జ్ చేసుకోవడానికి ఫైమాకి టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఆమెకి కొన్ని సినిమాలు పేర్లని ఇచ్చారు. తను ఆ సినిమా కథని ఇంగ్లీష్‌లో వివరిస్తూ ఆ పేర్లు చెప్పాల్సి ఉంటుంది.
వచ్చి రాని ఇంగ్లీష్‌తో ఫైమా బాగానే చెప్పేసింది. దీంతో ఆమెకు 85శాతం బ్యాటరీ రీచార్జ్ పెరిగింది. ఇక కెప్టెన్ అయిన రేవంత్ నిద్ర పోవడం వల్ల చార్జింగ్‌లో ఐదు శాతం కట్ అయ్యింది . బాలాదిత్య వంతు రాగా, ఆయన భార్యతో ఆడియో కాల్ మాట్లాడేందుకు తీసుకున్నారు. అందుకు యాభై శాతం ఛార్జ్ కట్ అయ్యింది. బ్యాటరీ రీచార్జ్ ఆప్షన్ శ్రీహాన్ కి తెలియకపోవడం వలన ఆయన సిరి, తన పేరేంట్స్‌తో మాట్లాడే అవకాశం వదులుకున్నాడు. ఈ విషయంలో బిగ్ బాస్ ని ప్రశ్నిస్తూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు.