Telugu Flash News

Bigg Boss6: శ్రీహాన్, కీర్తిల ఎమోష‌న‌ల్ జ‌ర్నీ చూపించిన బిగ్ బాస్.. ఎమోష‌న‌ల్ అయిన ఇద్ద‌రు కంటెస్టెంట్స్

Bigg Boss6: బిగ్ బాస్ సీజ‌న్ 6 కార్య‌క్ర‌మం ముగింపు ద‌శ‌కు చేరుతున్న కొద్ది చాలా ఎమోష‌న‌ల్‌గా మారుతుంది. కంటెస్టెంట్స్ ఇన్ని రోజుల జ‌ర్నీని చూపిస్తూ వారిని ఎమోష‌న‌ల్ అయ్యేలా చేస్తున్నారు బిగ్ బాస్. ఇప్పటికే రేవంత్‌, శ్రీ సత్య, ఆదిరెడ్డి, రోహిత్ లకు స్వాగతం పలికిన బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్‌లో శ్రీహాన్‌, కీర్తిలకు స్వాగతం పలుకుతూ వారి జర్నీలు చూపించారు. ఇద్దరివి రెండు విభిన్నమైన జర్నీలు కాగా, శ్రీహాన్ వీడియో కామెడీగా,ఫన్నీగా సాగితే, కీర్తిది చాలా ఎమోషనల్‌గా సాగింది.

కీర్తి వీడియో అయితే ప్రేక్ష‌కుల గుండె బ‌రువెక్కేలా చేసింది. మొదట శ్రీహాన్‌ గురించి చెబుతూ, బిగ్‌ బాస్‌ హౌజ్‌ ఎన్నో భావోద్వేగాల సమాహారం అని తెలిపారు. అందరితోనూ బాగానే ఉంటూ, అవసరమైనప్పుడు పోటీ పడుతూ, నవ్వులు పంచుతూ మాటలతోనే కాదు, చేష్టలతోనూ అలరించావన్నారు బిగ్‌ బాస్‌. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసివారు శ్రీహాన్‌, స్నేహం కోసం తగ్గిన తీరుని కూడా బిగ్ బాస్ అభినందించారు. ఆట ఎలా ఆడాలో తెలుసుకుని, అవసరమైనప్పుడు స్నేహంపై కూడా పోరాడి టికెట్‌ టూ ఫినాలే సాధించావని ప్ర‌శంస‌లు కురిపించారు. పట్టుకోవడంలోనే కాదు, వదిలేయడంలోనూ బలం ఉంటుందని నిరూపించావని చెప్పారు బిగ్‌ బాస్‌.

బిగ్ బాస్ మాట‌ల‌కు శ్రీహాన్ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఇక కీర్తి వంతు రాగా, ఆమె గురించి చాలా ఎమోషనల్ గా చెప్పారు బిగ్‌ బాస్‌. కల్పితాల్లో కంటే నిజ జీవితంలోనే ఎంతో నాటకీయత ఉంటుందన్నారు. కణకణ మండే కొడవలిలా జీవితంపై పోరాడారని, ఎంతో స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. చాలా సార్లు మీ కన్నీళ్లు మీ మనసులోని భావాలను దాచలేకపోయాయని వెల్లడించారు. సింపతి కోసమే మీ కన్నీళ్లు అంటూ చేసిన కామెంట్లని విని గుండె బరువెక్కిందని, కానీ ఆట ఆడితే గాయం మిమ్మల్ని ఆపలేదని నిరూపించారని, 14 వారాల సుధీర్ఘ ప్రయాణం పూర్తి చేసి ఫైనల్‌కి చేరుకున్నారని, ఇప్పుడు మీరు ఒక్కరు కాదని, మీ కుటుంబంలో లక్షల మంది ఉన్నారని తెలిపారు. దీనికి కీర్తి ఎమోషనల్‌ అయ్యింది. తాను నల్లగా ఉన్నానని రిజక్ట్ చేసిన వారికి, పనికిరావు అన్న వారికి ఇప్పుడు చెబుతున్నా ఇది కీర్తి, నేను కీర్తి. ఇదే కీర్తి అంటూ తనదైన స్టయిల్‌లో చెప్పుకొచ్చింది కీర్తి.

Exit mobile version