Homebigg boss telugu season 6Bigg Boss6: ప‌ర్‌ఫార్మెన్స్ ఇర‌గ‌దీసారుగా... శ్రీస‌త్య‌ని దింపేసిన ఇన‌య‌

Bigg Boss6: ప‌ర్‌ఫార్మెన్స్ ఇర‌గ‌దీసారుగా… శ్రీస‌త్య‌ని దింపేసిన ఇన‌య‌

Telugu Flash News

Bigg Boss6: బిగ్ బాస్ హౌజ్‌లో ప్ర‌స్తుతం గ‌తంలో కోల్పోయిన మ‌నీని ద‌క్కించుకునేందుకు గాను ప‌లు టాస్క్‌లు న‌డుస్తున్నాయి. ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి, రోహిత్, ఇనయా, శ్రీసత్య ఉన్నారు. వీరిలో టాప్ 5 ఎవ‌రు ఉంటారు, విన్న‌ర్ ఎవ‌రు అవుతారు అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. ఇక గ‌త కొద్ది రోజులుగా బిగ్ బాస్ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుండ‌గా, కంటెస్టెంట్స్ ధైర్యానికి పెద్ద‌ పరీక్ష పెడుతున్నాడు. కన్ఫెషన్ రూమ్ కి ఒక్కొక్కరినీ పిలిచి చుక్కలు చూపిస్తున్నాడు. పాములు, గడ్డి, అస్థిపంజరాలతో క‌న్ఫెష‌న్ రూమ్‌ని భయంకరంగా తయారు చేశాడు.

దెయ్యం గెటప్ లో ఒకరిద్దినీ ఆ చీకటి గదిలో ఉంచ‌డంతో పాటు హారర్ మూవీ సౌండ్ ఎఫెక్ట్స్ తో కంటెస్టెంట్స్ ని తీవ్ర భయానికి గురి చేస్తున్నాడు. అంద‌రు డేర్ చేసిన కన్ఫెష‌న్ రూంలోకి వెళ్ల‌గా, శ్రీసత్య మాత్రం బిగ్ బాస్ ఎంత చెప్పినా వెళ్ళలేదు. దీంతో బిగ్ బాస్ లక్ష రూపాయలు కట్ చేశాడు. అయితే ఆమెకు రెండో అవకాశం కూడా ఇవ్వ‌గా, శ్రీసత్య నా వల్ల కాదు బిగ్ బాస్, ఎవరో ఒకరు తోడు ఉంటేనే కన్ఫెషన్ రూమ్ కి వెళతానని ఖరాఖండిగా చెప్ప‌డంతో చేసేది లేక కీర్తిని శ్రీసత్యకు తోడుగా పంపారు. తర్వాత రోహిత్ డార్క్ రూమ్ లోకి వెళ్లడం జరిగింది.


రోహిత్ టాస్క్ పూర్తి చేయక ముందే కన్ఫెషన్ రూమ్ కి హౌస్ మేట్స్ అందరినీ పిలవడం జరిగింది. అనంత‌రం గతంలో హౌస్లో జరిగిన కొన్ని కీలక సంఘటనలు రీక్రియేట్ చేయాలి అన్నారు. అలాగే ఒకరి పాత్రలు మరొకరు ధరించాలని చెప్ప‌డంతో షో బిగినింగ్ లో శ్రీహాన్, ఇనయాకు మధ్య పిట్ట ఇష్యూని రీక్రియేట్ చేశారు. శ్రీహాన్ గా రేవంత్, ఇనయాగా శ్రీసత్య చేశారు. అలాగే హోటల్ టాస్క్, రోహిత్ ఫైర్ అయిన వీపుపై బ్యాగ్స్ ఖాళీ చేసే టాస్క్స్ ని రీక్రియేట్ చేయాలని బిగ్ బాస్ కోరడంతో బాల ఆదిత్యను శ్రీహాన్ ఇమిటేట్ చేసిన తీరు బాగుంది. ఇక నామినేషన్స్ లో ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, కీర్తి, ఇనయా, శ్రీసత్య ఉన్నారు. మరి ఎలిమినేట్ అయ్యేదెవరు? ఫైనల్ కి చేరేదెవరు? అనేది ఆదివారం డిసైడ్ అవుతుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News