Homebigg boss telugu season 6bigg boss telugu season 6 : బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్‌కి దారుణ‌మైన‌ టీఆర్పీ రేటింగ్.. బిగ్ బాస్ చరిత్ర‌లో ఇదే తొలిసారి..!

bigg boss telugu season 6 : బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్‌కి దారుణ‌మైన‌ టీఆర్పీ రేటింగ్.. బిగ్ బాస్ చరిత్ర‌లో ఇదే తొలిసారి..!

Telugu Flash News

bigg boss telugu season 6 : ఎక్క‌డో విదేశాల‌లో మొద‌లైన బిగ్ బాస్ ఆ త‌ర్వాత హిందీలోకి అడుగుపెట్టి అనంతరం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో అద‌ర‌గొడుతుంది. ముఖ్యంగా తెలుగులో ఈ షోకి ఉన్న ఆద‌ర‌ణ గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ప్ర‌స్తుతం తెలుగులో సీజ‌న్ 6 న‌డుస్తుండ‌గా, 21 మంది కంటెస్టెంట్స్‌తో ఈ షో ఆస‌క్తిక‌రంగా న‌డుస్తుంది. అయితే రీసెంట్‌గా ఈ షోలో సిసింద్రీ టాస్క్ ముగియ‌గా, చిన్న పిల్లలతో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలని బిగ్ బాస్ కోరాడు. దీంతో ఒక్కరొక్కరు తమ అనుభవాలను పంచుకొని అంద‌రికి క‌న్నీరు తెప్పించారు.

గ‌ట్టి దెబ్బ‌..

మూడునాలుగు రోజులుగా అపురూపంగా చూసుకున్న బొమ్మలను తిరిగి ఇచ్చేస్తున్న నేప‌థ్యంలో భావోద్వేగం ఆపుకోలేక కంటతడి పెట్టారు కంటెస్టెంట్స్.

ఆ త‌రువాత తమ జీవితంలో పిల్లలతో ఉన్న అనుబంధాన్ని కూడా నెమరు వేసుకున్నారు.అయితే ఈ షో స‌క్సెస్ ఫుల్‌గా 12 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.

అయితే ఈ షో లాంచింగ్ ఎపిసోడ్ ఎంత గ్రాండ్‌గా జ‌రిగిందో మ‌నం చూశాం. ఆ షోకి రణ్ భీర్ కపూర్, అలియాభట్ గెస్ట్ లుగా వచ్చి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు.

అయినా కూడా ఈ షో కేవ‌లం 8.86 టీఆర్‌పీ రేటింగ్ మాత్ర‌మే సాధించి అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఆరు సీజ‌న్స్‌లో ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు వ‌చ్చిన లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ ఇదే కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

-Advertisement-

నాలుగోసీజ‌న్ ఫస్ట్ ఎపిసోడ్ హ‌య్యెస్ట్‌గా 18.5 టీఆర్‌పీ రేటింగ్స్‌తో టాప్ ప్లేస్‌లో నిల‌వ‌గా, సీజ‌న్ 3 ఫ‌స్ట్ ఎపిసోడ్ 17.9 టీఆర్పీ రేటింగ్ ద‌క్కించుకున్న‌ది.

ఇక‌ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన లాంచింగ్ ఎపిసోడ్‌ 16.8 టీఆర్‌పీ రేటింగ్ సాధించింది. వీటిలో స‌గం మాత్ర‌మే సీజ‌న్ 6 ఫస్ట్ ఎపిసోడ్ కు రావ‌డం షాక్‌కు గురిచేస్తోంది.

అయితే దీనికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఆ రోజు ఇండియా- పాకిస్తాన్ టీ 20 మ్యాచ్ ఉన్న నేప‌థ్యంలో సీజ‌న్ 6 లాంచింగ్ ఎపిసోడ్‌కి గ‌ట్టి దెబ్బ ప‌డింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News