Telugu Flash News

Bigg Boss6: ఇన‌య‌, రేవంత్‌ని వ‌ణికించ‌లేక‌పోయిన దెయ్యాలు.. శ్రీస‌త్య వ‌ల‌న ల‌క్ష లాస్

Bigg Boss6: బిగ్ బాస్ హౌజ్‌లో దెయ్యాల సంద‌డి మొద‌లైంది. ప్ర‌తి సీజ‌న్‌లో మాదిరిగానే ఈ సీజ‌న్‌లోను హౌజ్‌మేట్స్‌ని చీక‌టి గ‌దిలోకి పంపి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. ఫస్ట్ రౌండ్ లో ఆదిరెడ్డి వెళ్లగా.. ఆతరువాత అతనికి తోడుగా శ్రీహాన్ ను కూడా పిలిచాడు. కన్ఫెషన్ రూమ్ ని హారర్ సెట్ లాగా మార్చి వార‌ని తెగ భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు బిగ్ బాస్. ఎలాగోలో బిగ్ బాస్ కనిపెట్టమన్న క్యాండిల్, గన్ ను కనిపెట్టి.. ఇచ్చిన టాస్క్ ని ఫినిష్ చేశారు. ఇక తాజా ఎపిసోడ్‌లో చీకటిగదిలోకి శ్రీసత్యని పిలిచాడు బిగ్ బాస్. శ్రీసత్య భయంతో వణికిపోతూ నేను వెళ్లనంటే వెళ్లనని మారాం చేసింది.

కన్ఫెషన్ రూమ్ దగ్గర చాలాసేపు వెళ్లనంటూ తెగ గోల చేసింది. హౌస్ మేట్స్ అందరూ బలవంతంగా తోస్తున్నా కూడా బయట డోర్ దగ్గరే నిలుచుండి నానా హంగామా చేసింది.. దాంతో బిగ్ బాస్ సత్య లోపలకు వెళ్లనందకు లక్ష రూపాయలు హౌస్ మెంట్స్ కోల్పోయినట్టు ప్రకటించాడు. దీంతో రేవంత్ కూసింత ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశాడు. త‌ర్వాత టాస్క్ లోకి రేవంత్, ఇనయా శ్రీసత్య రెడీ అయ్యారు. అయితే హౌస్ లో ఉన్నవారు ఈ టాస్క్ లో ఇనయా గెలుస్తుంది అని ముందుగా తమ అభిప్రాయాని తెలియజేశారు. అయితే టాస్క్ లో బిగ్ బాంబ్‌ని శ్రీసత్య తెలివిగా క‌ట్ చేసి విన్నర్ గా నిలిచింది. దాంతో.. ఇంటి సభ్యులు 64 వేల పాయింట్స్ మిస్అయ్యారు.

ఇక ఆతరువాత డార్క్ రూమ్ లోకి ఇనయా వెళ్ల‌గా, ముందుగా ధైర్యంగానే ఉన్నా గదిలో అరుపులు కేకలకు భయపడి వణికిపోయింది. భయంతో..గదిలో వణికిపోతూ కూడా.. తన టాస్క్ ను కంప్లీట్ చేసింది ఇనయా. ఇక ఆతరువాత రేవంత్ డార్క్ రూమ్ లోకి వెళ్లగా.. రేవంత ధైర్యాన్ని ముందే గ్రహించిన బిగ్ బాస్.. రెండు డెవిల్ క్యారెక్టర్స్ ను డార్క్ రూమ్ లో సెట్ చేసిన ఏ మాత్రం బయపడకుండా రేవంత్ అనుకున్నది సాధించి.. గదిలోంచి ఓ కప్ ను పట్టుకుని వచ్చాడు. ఆ తరువాత మనీ టవర్ టాస్క్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. జంతూవుల టాస్క ఇచ్చాడు..ఇలా రోజు మొత్తం టాస్క్ లతో మోత మోగించాడు.

Exit mobile version