Homebigg boss telugu season 6Bigg Boss6: ఫ‌స్ట్ ఫైన‌లిస్ట్‌గా శ్రీహాన్.. ఆది క‌న్ఫ్యూజ‌న్‌పై క్లారిటీ ఇచ్చిన నాగ్

Bigg Boss6: ఫ‌స్ట్ ఫైన‌లిస్ట్‌గా శ్రీహాన్.. ఆది క‌న్ఫ్యూజ‌న్‌పై క్లారిటీ ఇచ్చిన నాగ్

Telugu Flash News

Bigg Boss6: బిగ్ బాస్ సీజ‌న్ 6 తెలుగు కార్య‌క్ర‌మం 13వ వారం కూడా తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ వారం డబుల్ ఎలిమినేష‌న్ ఉంటుంద‌ని అంద‌రు ఊహించ‌గా, అలా జ‌ర‌గ‌లేదు. ప్ర‌స్తుతం హౌజ్‌లో ఎనిమిది మంది ఉన్నారు. 15వ వారం వ‌ర‌కు ముగ్గురు ఎలిమినేట్ కావ‌లసి ఉంది. మ‌రి బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్‌లు ఇస్తాడో అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే శ‌నివారం ఎపిసోడ్‌లో మొదట టికెట్‌ టూ ఫినాలే కోసం రేవంత్‌, శ్రీహాన్‌ మధ్య ఫైన‌ల్ రౌండ్ సాగింది. తాడుని ఎక్కువ సేపు ఎవరైతే ఊపుతూనే ఉంటారో వాళ్లు విన్నర్ అని చెప్ప‌గా, రేవంత్ మ‌ధ్య‌లో డ్రాప్‌ కావడంతో శ్రీహాన్‌ విన్నర్ అయ్యారు. ఆరో సీజన్‌ షోలో ఫైనల్‌కి చేరి తొలి కంటెస్టెంట్‌గా నిలిచారు.

ఇక కూతురు పుట్టిన రేవంత్‌కి, ఫైనల్‌లోకి అడుగుపెట్టిన శ్రీహాన్‌కి అభినందనలు తెలిపారు నాగార్జున. ఇక‌ ఈ సీజన్‌లో ఏ వారంలో రిగ్రెట్‌(విచారం) ఫీలవుతున్నారో తెలిపాలన్నారు నాగ్‌. ఫైమా ఆరో వారంలో సుధీప విషయంలో ఎటకారం చేసిన దానికి రిగ్రెట్‌ ఫీలయ్యానని చెప్ప‌గా, ఇనయ.. తొమ్మిదో వారంలో ఎక్కువ మాటలు అన్నానని, అందుకు బాధగా ఉందని పేర్కొంది. శ్రీహాన్‌ 12వ వారంలో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాక కొన్ని విషయాల్లో రిగ్రెట్ అయ్యానని , కీర్తి ఈ వారంలో బ్రిక్స్ ని తన్నడం, ఆ గేమ్‌ విషయంలో తాను రిగ్రెట్‌గా ఫీలవుతున్నానని తెలియ‌జేసింది. రేవంత్‌ 1 నుంచి 6 వారాల వరకు బూతులు, కోపం, 8వ వారంలో చేపల టాస్క్ లో, 9వ వారంలో ఆదిరెడ్డి విషయంలో, 13వ వారంలో తాను రిగ్రెట్ ఫీలయ్యానని చెప్పుకొచ్చాడు.

రోహిత్‌ 12వ వారంలో కెప్టెన్సీ టాస్క్ లో రిగ్రెట్‌ అయ్యానని, . శ్రీ సత్య 2 వారం, 11 వారం రిగ్రెట్‌ అయ్యానని, ఆదిరెడ్డి రెండో వారం, తొమ్మిదో వారం, 11 వారం రిగ్రెట్‌ అయినట్టు తెలియ‌జేశారు. ఇక ఈ సీజన్‌ బెస్ట్ కెప్టెన్‌, వరస్ట్ కెప్టెన్‌ ఎవరో చెప్పాల్సిన టాస్క్ లో ఎక్కువ ఓట్లు వచ్చిన ఇనయ బెస్ట్ కెప్టెన్ కాగా, ఆదిరెడ్డి వరస్ట్ కెప్టెన్‌ అయ్యారు. ఇక రేవంత్ కి తన కూతురుని చూపించారు నాగ్‌. ఆసుపత్రిలో బెడ్‌పై ఉన్న తన భార్యని, కూతురుని చూపించడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు రేవంత్‌. ఈ సందర్భంగా `పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా..` అనే పాట పాడి త‌న ఆనందాన్ని మ‌రింత పెంపొందించుకున్నాడు. ఇక నామినేష‌న్స్‌లో ఉన్న వారిలో రోహిత్‌, కీర్తి సేవ్ కాగా, ఫైమా, రేవంత్‌, శ్రీ సత్య, ఆదిరెడ్డి ఇంకా నామినేషన్స్‌ లో ఉన్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News