Homebigg boss telugu season 6Bigg Boss6: ఎలిమినేట్ అయిన ఫైమా.. ఎప్పుడు లేనంత ఎమోష‌న‌ల్ అయిన ఆదిరెడ్డి

Bigg Boss6: ఎలిమినేట్ అయిన ఫైమా.. ఎప్పుడు లేనంత ఎమోష‌న‌ల్ అయిన ఆదిరెడ్డి

Telugu Flash News

Bigg Boss6: బిగ్ బాస్ 13వ వారంలో ఇద్ద‌రు ఎలిమినేట్ అవుతార‌ని ఊహించ‌గా, కేవ‌లం ఒకే వ్య‌క్తిని ఎలిమినేట్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఎప్ప‌టి మాదిరిగానే ముందుగా షో స‌రదా స‌రదాగా సాగింది. హిట్ 2తో విజయం అందుకున్న అడివి శేష్ ఈ ఎపిసోడ్ కి అతిథిగా హాజరు కాగా, నాగార్జునతో కలసి బిగ్ బాస్ వేదికపై కాసేపు సంద‌డి చేశాడు. అయితే నాగ్ ముందుగా శ్రీహాన్, కీర్తి మ‌ధ్య జ‌రిగిన ఫైట్ చూపించారు. అనంత‌రం ఒక్కొక్కరిని పిలిచి హౌస్ లో తనకు లైఫ్ లాంగ్ ఫ్రెండ్ షిప్ ఎవరితో ? ఫ్రెండ్ షిప్ కట్ చేసుకోవడం ఎవరితో ? అని చెప్పాలని అన్నాడు. ఇలా ఒక్కొక్కరూ తమ ఫ్రెండ్ ఎవరో, ఫ్రెండ్ షిప్ కట్ ఎవరో తెలియ‌జేస్తూ క‌ట్ చేయాల్సిన వాళ్ల ఫొటోస్ కూడా చింపి డ‌స్ట్ బిన్‌లో వేశారు.

ఇంతలో నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేసే ప్రక్రియ మొదలైంది. ఆదిరెడ్డి, శ్రీసత్య, రేవంత్, ఫైమా నామినేషన్స్ లో ఉండ‌గా, వారిలో రేవంత్ మాత్రమే సేవ్ అయ్యాడు. దీనితో రేవంత్ తనకి ఓట్లు వేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. నాకు కుమార్తె పుట్టింది. అక్కడ తల్లి బిడ్డా సేఫ్.. ఇక్కడ నేను సేఫ్ అంటూ తెగ సంతోష పడ్డాడు రేవంత్. ఇక హిట్ 2 టీం హీరో అడివి శేష్, దర్శకుడు శైలేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇంటి సభ్యులతో ఫన్నీగా మాట్లాడుతూ కొన్ని గేమ్స్ కూడా ఆడారు. శ్రీహాన్.. మీనాక్షి విషయంలో పులిహోర కలుపుతున్నాడు అంటూ అడివి శేష్ అతడిని ఆటపట్టించ‌గా, ఎనిమిది మందిలో రేవంత్ గీసిన బొమ్మని క‌రెక్ట్‌గా క‌నిపెట్టాడు అడ‌విశేష్‌.

హిట్ 2 టీం వెళ్ళిపోయాక నాగార్జున నామినేషన్స్ లో ఉన్న ఆదిరెడ్డి, ఫైమా, శ్రీ సత్య ల‌లో శ్రీస‌త్య‌ని సేవ్ చేశారు. అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు కాగా, ఫైమాపై రెడ్ ప్ల‌వ‌ర్స్ ప‌డ‌డంతో ఆమె ఎలిమినేట్ అయిన‌ట్టు ప్ర‌క‌టించారు నాగ్. బాధ‌ని అంతా దిగ‌మింగుకుంటూ ఫైమా హౌజ్‌ని వీడింది. ఆదిరెడ్డికి ఉదయాన్నే ఎగ్ ఇవ్వండి అంటూ ఇతర సభ్యులకు ప్రేమగా చెప్పుకొచ్చింది ఫైమా. అనంత‌రం పాపం ఆ పిల్ల తనని ఎంతగా గుర్తు పెట్టుకుందో అని ఆదిరెడ్డి కంటతడి పెట్టుకున్నాడు. ఇక ఫైమా స్టేజ్ మీదకు వెళ్లాక కూడా తెగ వినోదం పంచింది. మొత్తానికి హౌజ్‌లో 7 గురు ఉండ‌గా, వారిలో ఇద్ద‌రిని ఎప్పుడు ఎలా ఎలిమినేట్ చేస్తార‌నేది స‌స్పెన్స్.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News