Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ 6 ఎట్టకేలకు ఈ వారంత తెరపడనుంది. మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ ఈ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టగా, ఇప్పుడు కేవలం హౌజ్‌లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. వారికి మంచి అనుభూతిని పంచాలని బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడు. వాళ్లకు స్వీట్ సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ప్రతి కంటెస్టెంట్స్ అందమైన బిగ్ బాస్ జర్నీతో కూడిన ఫోటోలు ఏర్పాటు చేసి, దీపపు కాంతుల మధ్య కంటెస్టెంట్స్ గురించి చెప్పుకొస్తున్నాడు. ముందుగా రేవంత్ గురించి బిగ్ బాస్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కోపం నీ వీక్నెస్, అది అనేక పొరపాట్లకు కారణమైంది. ఆ విషయాన్ని త్వరగా తెలుసుకొని అందుకు తగ్గట్లు మారి కోపాన్ని ఫ్యాషన్ గా మార్చుకున్నావు.
నిజానికి జీవితంలో అన్ని భావోద్వేగాలు ఉన్నవారే నిజమైన విజేతలు. జీవితంలో తండ్రి అయ్యే అద్భుత క్షణాలు దగ్గరుండి అనుభవించే అవకాశాన్ని బిగ్ బాస్ కారణంగా కోల్పోయారు. మీ త్యాగానికి ప్రతిఫలం దక్కాలని, బిగ్ బాస్ ఫినాలేకు బిగ్ బాస్ తరపున ఆల్ ది బెస్ట్, అని చెప్పాడు. ఇక బిగ్ బాస్ మాటలకు రేవంత్ కాస్తఎమోషనల్ అయ్యాడు. ఇక రేవంత్ తర్వాత శ్రీసత్యకు ఛాన్స్ రాగా, ఆమె జర్నీని అనేక ఫోటోలలో బంధించారు. అవన్నీ చూస్తూ శ్రీసత్య మురిసిపోయింది. కాసేపటి తర్వాత ఫోన్ రింగ్ కాగా, అందులో రికార్డ్ చేసిన శ్రీ సత్య వాళ్ళ అమ్మ సందేశం ఉంది. ఈ ఫైనల్ వీక్ కూడా బాగా ఆడి విజయం సాధించాలని శ్రీసత్య మదర్ చెప్పారు.
అనంతరం శ్రీసత్య హౌస్ జర్నీ పై రూపొందించిన స్పెషల్ వీడియో ప్రదర్శించారు. అనంతరం శ్రీసత్యను బిగ్ బాస్ అభినందించారు. హౌస్లోకి వచ్చిన కొత్తలో భయాలు, సందేహాలతో నీవు సతమతమయ్యావు. బంధాల విషయంలో అయోమయం చెందావు. వాటిని అన్నింటినీ అధిగమించి ఫైనల్ వరకు వచ్చావు. అది అభినందనీయం. నీలో పోరాట స్ఫూర్తి ఉందని బిగ్ బాస్ శ్రీసత్యకు చెప్పాడు. అక్కడ ఉన్న ఫోటోగ్రాఫ్స్ లో ఇష్టమైనది ఒకటి తీసుకెళ్లొచ్చని చెప్పగా… శ్రీసత్య తన ఫోటో తీసుకొని అక్కడ నుండి వచ్చేసింది. చాలా బాగా ఉందని తోటి కంటెస్టెంట్స్ తో చెప్పింది. ఇక ఇదిలా ఉంటే బుధవారం వరకు తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని వారం మధ్యలో బయటకు పంపనున్న విషయం తెలిసిందే.